Hit Songs
-
స్టూడెంట్స్‌తో మహిళా ప్రొఫసర్ క్రేజీ డ్యాన్స్ : వీడియో హల్చల్
సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్‌కు క్రేజ్ ఎక్కువ. సూపర్ హిట్ సాంగ్‌కు రీల్స్ చేసినా, డ్యాన్స్ చేసిన ఇక రచ్చ రచ్చే. తాజాగా కొచ్చిన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పుష్ప -2 సినిమాలో హిట్ సాంగ్ కి చేసిన డ్యాన్సింగ్ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇన్‌స్టాలో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే 70 లక్షలకుపైగా వ్యూస్‌ను సంపాదించింది.కొచ్చిన్ (Cochin)యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో వేడుకలు ఘనంగా జరుగు తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థినిలు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. అప్పటిదాకా ప్రశాంతంగా చూస్తూ కూర్చున్న మహిళా ప్రొఫెసర్ విద్యార్థినిలతో జత కలిసి స్టెప్పులు వేయడం మొదలు పెట్టారు. తన చేతిలోని బ్యాగ్‌ను కుర్చీపై పెట్టి మరీ రంగంలోకి దిగి పోయారామె. అమ్మాయిలతో సమానంగా జోరుగా డ్యాన్స్ చేశారు. అదీ చీరలో.. సూపర్ స్టెప్స్‌తో తమకు పోటీగా మేడమ్ తమతో జత కట్టడం చూసిన విద్యార్థినులు మరింత ఉత్సాహంగా డాన్స్ ఇరగదీశారు. ఏ పాటకో తెలుసా?పుష్ప 2: ది రూల్ మూవీలోని ‘పీలింగ్స్’ సాంగ్‌కు మైక్రోబయాలజీ ప్రొఫెసర్,డిపార్ట్మెంట్ హెడ్ (HOD), అయిన పార్వతి వేణు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “మీ హెచ్ఓడీ మేడమ్ మీ కంటే ఎక్కువ వైబర్గా ఉన్నప్పుడు” అనే క్యాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియోను నెటిజన్లు ఉత్సాహంగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by @ottta_mynd -
హిట్ సాంగ్స్ 2022
-
‘సాంగు భళా’: ఈ ఏడాది బాగా అలరించిన సాంగ్స్, అవేంటంటే..
మాటల్లో చెప్పలేని భావాన్ని పాటల్లో మరింత చక్కగా ఆవిష్కరించే వీలుంటుంది. ప్రేమ, విషాదం, ఆనందం.. ఏ భావోద్వేగాన్ని అయినా పాటలో పలికించవచ్చు. ఆ పాట ట్యూన్ క్యాచీగా ఉంటే శ్రోతల అటెన్షన్‌ని క్యాచ్ చేస్తుంది. 2022లో జనవరి నుంచి డిసెంబర్ వరకు అలాంటి ‘క్యాచీ సాంగ్స్’ చాలా వచ్చాయి. ‘సాంగు భళా’ అంటూ ఆకట్టుకున్న బోలెడన్ని పాటల్లో కొన్ని ఈ విధంగా... సినిమా పాట సంగీతం బంగార్రాజు కళ్లకు కాటుక ఎట్టుకుని.. కాళ్లకు పట్టీలు కట్టుకుని... అనూప్ రూబెన్స్ రౌడీ బాయ్స్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే... దేవిశ్రీ ప్రసాద్ గుడ్‌లక్ సఖి రావే రావే సఖి.. మురిసే ముచ్చట్లకి... దేవిశ్రీ ప్రసాద్ ఖిలాడీ నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్... దేవిశ్రీ ప్రసాద్ సెహరి ఓ కలలా.. ఇన్నాల్లే నిన్ను దాచి లోకమే... ప్రశాంత్ ఆర్. విహారి డీజే టిల్లు లాలాగూడ అంబర్‌పేట మల్లేపల్లి మలక్‌పేట... రామ్ మిర్యాల పటాసు పిల్లా... భీమ్లా నాయక్ భీమ్లా నాయక్.. ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ... ఎస్. తమన్ ఆడవాళ్లు మీకు జోహార్లు ఆడాళ్లు మీకు జోహార్లు... దేవిశ్రీ ప్రసాద్ రాధేశ్యామ్ నగుమోము తారలే.. తెగిరాలె నేలకే... తమన్ ఆర్ఆర్ఆర్ పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు... ఎంఎం కీరవాణి కొమురం భీముడో కొమురం భీముడో... ఆచార్య సీమలు దూరని సిట్టడవికి సిరునవ్వొచ్చింది... మణిశర్మ లాహే లాహే లాహే లాహే లాహే లాహే... సర్కారువారి పాట వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి... మ మ మహేశా... ఎస్. తమన్ ఎఫ్ 3 అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.. దేవిశ్రీ ప్రసాద్ మేజర్ నిన్నే కోరెనే.. నిన్నే కోరే.. శ్రీచరణ్ పాకాల అంటే సుందరానికీ.. చెంగుచాటు చేగువేరా... ఎంత చిత్రం... వివేక్ సాగర్ షికారు మనసు దారితప్పెనే... శేఖర్ చంద్ర ది వారియర్ నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడవుతుంది... దేవిశ్రీ ప్రసాద్ బింబిసార గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం... ఎంఎం కీరవాణి సీతారామం ఇంతందం దారి మళ్లిందా భూమిపైకి చేరుకున్నదా... ఓ సీతా వదలనిక తోడవుతా... విశాల్ చంద్రశేఖర్ మాచర్ల నియోజకవర్గం మాచర్ల సెంటర్లో మాపటేల నేనొస్తే.. మహతి స్వరసాగర్ గాడ్‌ఫాదర్ తార్ మార్ తక్కర్ మార్.. తమన్ జిన్నా జారు మిఠాయో నా జారు మిఠాయ.. అనూప్ రూబెన్స్ హిట్: ది సెకండ్ కేస్ రానే వచ్చావ వానై నా కొరకే... జాన్ స్టీవర్ట్ ఎడూరి ధమాకా నిన్ను సూడ బుద్ధి అయితాంది రాజిగో... భీమ్స్ సిసిరోలియో -
2021 యూట్యూబ్ టాప్ హిట్ సాంగ్స్
-
పాటల మ్యాజిక్: వింటూ మైమరిచిపోదాం..
కొన్ని పాటలు వింటుంటే మనల్ని మనమే మైమరిచిపోతాం.. తెలీకుండానే తల, చేతులు ఆడిస్తుంటాం.. లైన్ తెలిస్తే బాత్రూం సింగర్ కంటే మెరుగ్గా పాట కూడా పాడేస్తాం. ఇక ఈ ఏడాది ఎన్నో పాటలు ఓ ప్రవాహంలా వస్తే చాలా పాటలు ఒడ్డుకు నిలబడి విజయాన్ని అందుకున్నాయి. కొన్ని ప్రేమ గీతాలను ఆలపిస్తే, మరికొన్ని తీన్మార్ స్టెప్పులతో ఊరమాస్ అనిపించాయి. అలా 2019 మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. మరి ఈ ఏడాది టాప్ టెన్ తెలుగు పాటలు ఏంటో పాడేద్దాం... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఇందులోని ప్రతీ పాట బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తోంది. సామజవరగమన.. నిను చూసి ఆగగలనా అనే పాట యూట్యూబ్‌లో ఆగకుండా దూసుకుపోతోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు తమన్ సంగీతమందించగా సీతారామశాస్త్రి లిరిక్స్ అందించాడు. బాహుబలి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ భారీ బడ్జెట్‌తో ‘సాహో’ చేశాడు. ఇది ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో కొన్ని పాటలే జనాలకు క్లిక్ అయ్యాయి. కానీ ఒక పాటకు మాత్రం జనాలు విపరీతంగా ఆకర్షితులయ్యారు. అదే ‘ఆగదిక సయ్యా సైకో..’’ ఈ పాట క్యాచీగా ఉండటంతో పాటు మిక్స్డ్ భాషలు ఉపయోగించి అందరి నోట పాడించేలా చేశారు గేయ రచయిత శ్రీజో. స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో ఓ సైరా అనే పాట ఆయన గొప్పతనాన్ని తెలుపుతూ సాగుతుంది. ఈ సినిమాలో ఇది ప్రధాన పాట కాగా ఇది జనంలో మార్మోగిపోయింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన మహర్షి సినిమా అంచనాలను దాటి వసూళ్లను సాధించింది. మహర్షి పేరుకు తగ్గట్టుగా పాట ‘ఇదే కదా ఇదే కదా..’ పాట ఉత్తేజాన్ని నింపింది. మహేశ్‌బాబు ‘నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాలకు దేవీశ్రీప్రసాద్ సూపర్ హిట్ సంగీతాన్ని అందించారు. ‘మహర్షి’తో మరో హిట్ అందించారు దేవీశ్రీప్రసాద్. ఇది నీ కథ అని చెప్తూ ఈ పాట అందరి మనసులకు చేరువైందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని ‘దిమాక్ ఖరాబ్’ పాట జనాలను ఇప్పటికీ వదలట్లేదు. మణిశర్మ సంగీతమందించిన ఈ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాటకు ఎనర్జిటిక్ హీరో రామ్ ఇరగదీసే స్టెప్పులు వేయగా హీరోయిన్ డ్యాన్యులతో ‘ఇస్మార్ట్ పాట’ అని ముద్ర వేసుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను కీర్తన శర్మ, సాకేత్ ఆలపించారు. ‘ప్రియతమా.. ప్రియతమా..’ ఈ పదంలోనే ఏదో మత్తు ఉంది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటల లిస్టులో ఈ పాట కూడా చేరిపోయింది. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను చిన్మయి శ్రీపాద ఆలపించింది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ‘మజిలీ’ సినిమాలోని ఈ పాటలో అక్కినేని నాగచైతన్య, సమంత వారి హావభావాలతో పాటను మరింత రక్తికట్టించారు. చిత్రలహరి సినిమాలో ‘ప్రేమ వెన్నెల..’ పాట తెలియనవారు లేరంటే నమ్మండి. అందులోని ఈ పాటకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సుదర్శన్ అశోక్ రచించిన ఈ పాటకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. శ్రీమాన్ అద్భుతంగా పాడాడు. నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు సినిమాలతో పలకరించాడు. ఒకటి ‘జెర్సీ’ కాగా మరోటి ‘గ్యాంగ్ లీడర్’. రెండింటిలోనూ మంచి పాటలకు కొదువే లేదు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమాలోని ‘హొయినా హొయినా’ పాట అందరినీ ఉర్రూతలూగించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించగా, ఈ పాటను ఆలపించిన ఇన్నో జెంగా తన గాత్రంతో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ‘ఓ బావా.. మా అక్కను సక్కగ సూస్తావా..’ సాంగ్‌తో మరో హిట్ అందుకున్నాడు. కేకే రాసిన పాటను సత్య యామిని, మోహన భోగరాజు, హరి తేజ దానికి తగ్గట్టుగా ఆలపించారు. ప్రతిరోజు పండగే చిత్రంలోని ఈ పాట ఇప్పటికీ అందరి ఫోన్లలో మోగుతూనే ఉంది. బావను ఆట పట్టించడానికి మరదళ్లు ఈ పాటతో ఓ ఆట ఆడేసుకుంటున్నారనుకోండి. క్రికెట్ చుట్టూ తిరిగే కథ ‘జెర్సీ’. ఇందులో ‘అదేంటో గానీ ఉన్నపాటుగా..’ పాట ఎంత హిట్టో మనందరికీ తెలిసిందే. దీనికి సంగీతాన్ని అందించిన అనిరుధ్ తనే స్వయంగా ఆలపించాడు. క్రిష్ణ కాంత్ మెలోడీకి తగ్గట్టుగా పాట రచించాడు. పెళ్లి తర్వాత ప్రేమ మరింత పెరుగుతుందని నిరూపిస్తుందీ పాట. -
మరో సాంగ్ రీమిక్స్ చేయనున్న మెగా హీరో
సంగీత ప్రియులను అలరించే పాత పాటలను రీమిక్స్ చేయడం టాలీవుడ్లో కొత్తేం కాదు. సమయానుకూలంగా చాలా మంది హీరోలు పాత సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో కొన్నింటిని సందర్భానుసారం వాడుకుంటుంటే, మరికొంత మంది సెంటిమెంట్ కోసం రీమిక్స్ చేస్తారు. మెగా మేనళ్లుడు సైతం ఇప్పటికే రెండు సూపర్‌డూపర్ హిట్ పాటలను తన సినిమాల్లో వాడేశాడు. వరుసగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో సాయి ధరమ్ తేజ్ మళ్లీ రీమిక్స్ మార్గం ఎంచుకున్నాడు. మెగాస్టార్ పాటలను రీమిక్స్ చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో మామయ్య మెగాస్టార్ పాటలను తిరిగి రీమిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు సాయి. ఇందుకోసం కొండవీటి దొంగ సినిమాలోని ఛమకు ఛమకు ఛామ్ అనే పాటను రీమిక్స్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. మరి మామయ్య సాంగ్ సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. -
జ్యుక్ బాక్స్ 15th October 2017
-
సిచుయేషన్కు అద్దం పట్టిన అమితాబ్ హిట్ సాంగ్స్
-
ఇరవై భాషల్లో పాడాను!
కైలాశ్ ఖేర్ పాడితే పాట సూటిగా గుండెల్లోకి దూసుకెళుతుంది. సంగీతం మీద ఇష్టంతో చిన్నతనంలోనే ఇంటికి దూరమైన కైలాశ్ చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. సంగీతం మీద ప్రేమతో మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించి, ఇప్పుడు దేశంలో ఓ ప్రఖ్యాత గాయకుల్లో ఒకరుగా మారారు. హిందీలో పలు హిట్ సాంగ్స్ పాడిన కైలాశ్ తెలుగు శ్రోతలకూ సుపరిచితమే. ‘జేజమ్మా... రావమ్మా’, ‘పండగలా దిగి వచ్చాడు’ వంటి పాటలతో ఇక్కడివారినీ ఆకట్టుకున్నారు. తాజాగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం కోసం ఓ పాట పాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కైలాశ్ మాట్లాడుతూ-‘‘నాకు పాటలు పాడ టంలో భాషా భేదం లేదు. ఆ పాటలోని భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటే చాలు ఈజీగా పాడేస్తా. అందుకే ఇప్పటికి 20 పైగా భాషల్లో పాడగలిగాను. ‘నిర్మలా కాన్వెంట్’ కోసం ‘ముందు నుయ్యి-వెనుక గొయ్యి’ అనే పాట పాడా. 60, 70 దశకాల్లోని పాటలను తలపించిందీ పాట. ఇప్పటివరకూ తెలుగులో నేను పాడిన పాటలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అని చెప్పారు.