
విందులో మాంసం పెట్టలేదని పెళ్లి రద్దు చేసుకునేదాకా వచ్చిన ఘటన ఇటీవలే చూశాం. పెళ్లి తరువాత ఫొటోల కోసం ఇరుపక్షాల బంధువులు కొట్లాడుకుని గాయాలపాలైన సంఘటన యూపీలో జరిగింది. వివరాల ప్రకారం.. యూపీ, డియోరియా జిల్లాలోని మాధవ్‌పూర్ గ్రామంలో అంగరంగవైభవంగా పెళ్లి జరుగుతోంది.
వరమాల పూర్తవ్వగానే ‘మేం మొదట ఫొటోలు దిగుతాం’ అని అబ్బాయివారు, ‘లేదు మేమే ముందు దిగుతాం’ అని అమ్మాయి వాళ్ల మధ్య వాదన మొదలైంది. అసలే రాత్రిపూట పెళ్లి... విందులో మద్యం లేకుండా ఉండదు కదా! తాగి ఉన్న అబ్బాయి బంధువులు ‘మేమే ముందు తీసుకుంటా’మంటూ పట్టుబట్టారు. వాదన కాస్త భౌతిక దాడుల దాకా వెళ్లింది. కొందరు పెద్దలు వారించేందుకు ప్రయతి్నంచినా.. ‘తగ్గేదేల్యా’ అన్నారు బంధువులు. ఫలితం ఇరుపక్షాల వారికి తీవ్రమైన గాయాలయ్యాయి. అబ్బాయి సోదరి కూడా గాయపడింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి అయితే వచ్చింది కానీ.. ఈ ఘటనలతో విసుగు చెందిన అబ్బాయి మాత్రం తాళి కట్టేందుకు ససేమిరా అన్నాడు. చివరకు మనసు మార్చుకుని తాళి కట్టడంతో కథ సుఖాంతమైంది. ఆ తరువాత ఫొటోలు ఎవరు ముందు దిగారో?.
Comments
Please login to add a commentAdd a comment