గుమ్మిడిపూండి:పెళ్లి భోజనాల వద్ద జరిగిన గొడవలో ఓ యువకుడిని హత్యకు గురైన సంఘటన మాదరపాక్కంలో మంగళవారం జరిగింది. మాదరపాక్కం సమీపంలోని పాదిరివేడు దళిత కాలనికి చెందిన ఓ యువకుడికి ఈగువారిపాలెం సమీపంలోని కుమ్మనాయుడుపేటకు చెందిన యువతితో సోమవారం గుమ్మిడిపూండిలో వివాహం జరిగింది. భోజనాల వద్ద పాదిరివేడు, కుమ్మనాయుడు పేటకు చెందిన యువకుల మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పుడు ఇరుగ్రామాలకు చెందిన పెద్దలు నచ్చచేప్పి పంపివేశారు. అయితే పాదిరివేడు గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ (21) ఒంటరిగా పాదిరివేడుకు వెళుతుండగా కుమ్మనాయుడుపేటకు చెందిన యువకులు కర్రలతో కొట్టి హత్య చేసి సమీపంలోని కల్వర్టు క్రింద పడవేశారు.
ఈ విష యం తెలిసిన మాదరపాక్కం గ్రామస్తులు ఆగ్రహంతో కుమ్మనాయుడుపేట గ్రామంపై దాడి చేశారు. అరుణ్‌కుమార్‌ను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ..షాపులు మూసి ధర్నాకు దిగారు. రోడ్డుపై టైర్లు కాల్చి రాస్తారోకో చేశారు. దీంతో బస్సులు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న గుమ్మిడిపూండి డీఎస్పీ శివలింగం వచ్చి ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో చర్చలు జరిపారు. వారు వినకపోవడంతో జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వగా వెంటనే ఎస్పీ శాంసన్ మాదరపాక్కం గ్రామానికి వచ్చారు.
ఈ సమయంలో పాదిరివేడుకు చెందిన కొం దరు కుమ్మనాయుడు పేటకు చెందిన ఓ యువకుడిని చితక్కొట్టారు. దీంతో రెండు గ్రామాల్లో అలజడి రేగింది. నిందితులను అరెస్టు చేసేంత వరకు ఇక్కడినుంచి కదలమని భీష్మించుకుని కూచున్నారు. దీంతో జిల్లా ఎస్పీ శాంసన్, తహసీల్దార్ పాల్‌స్వామి అక్కడే ఉన్నారు. ఎట్టకేలకు సాయంత్రం గ్రామస్తులు శాంతించారు.
పెళ్లిలో గొడవ: యువకుడి హత్య
Published Wed, Apr 22 2015 1:53 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
Advertisement
Advertisement