
వధువరులను ఆశీర్వదిస్తున్న మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి
పెండ్లిమర్రి : వెల్లటూరు దళితవాడకి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు ఏ.ఓబులేసు కుమారుడు ఓబులేసు, మణికుమారిల వివాహం శుక్రవారం వెల్లటూరు లోని ఎస్‌డీఏ చర్చిలో జరిగింది. మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్రారెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, సింగల్ విండో అధ్యక్షుడు నాగేంద్రారెడ్డిలు నూతన వధువరులను ఆశీర్వదించారు. పగడాలపల్లె, రెడ్డిపల్లె గ్రామాలకు చెందిన మల్లికార్జునరెడ్డి, తులసి, శివానందరెడ్డి, లక్ష్మి సుష్మితదంపతులను మాజీ ఎంపీ ఆశ్వీరదించారు.