
వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. అంతకుముందు వైఎస్ జగన్‌కు పార్టీ గుంటూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.