తమిళనాడులో తొలిసారిగా పెళ్లి వేడుక కోసం హెలికాప్టర్ కెమెరాను వినియోగించారు. మధురైలోని రాజాముత్తయ్య కల్యాణ మండపంలో బుధవారం ఓ పెళ్లి వేడుకను హెలికాప్టర్ ద్వారా చిత్రీకరించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో తొలిసారిగా పెళ్లి వేడుక కోసం హెలికాప్టర్ కెమెరాను వినియోగించారు. మధురైలోని రాజాముత్తయ్య కల్యాణ మండపంలో బుధవారం ఓ పెళ్లి వేడుకను హెలికాప్టర్ ద్వారా చిత్రీకరించారు. సినిమా, టీవీ సీరియల్ షూటింగ్‌లకు వినియోగించే రూ. 7 లక్షల విలువైన అధునాతన కెమెరాను హెలికాప్టర్‌కు యంత్రాల సహాయంతో బిగించి చిత్రీకరణ చేశారు. మధురైలోని ప్రైవేట్ స్టూడియో యజమాని అయిన మహేంద్రన్ ఈ హెలికాప్టర్ కెమెరా గురించి మాట్లాడుతూ.. దీని సహాయంతో పెళ్లి వేడుకల్లోని ప్రతి ఘట్టాన్నీ, సంఘటనలనూ, మండపంలో అన్ని మూలలా ఉన్న వారి ముఖాలు సైతం స్పష్టంగా కనిపించేలా ఆకాశం నుంచే చిత్రీకరించవచ్చని చెప్పారు. హెలికాప్టర్ కెమెరా ద్వారా చిత్రీకరణకు రోజుకు రూ. 40 వేలు అద్దెవసూలు చేస్తామని చెప్పారు.