
కుత్బుల్లాపూర్: ఈ చిత్రంలోని వధూవరులను చూశారా. పెళ్లి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు షేక్ హ్యాండ్ ఇస్తున్న వారిని నివారిస్తూ సాదరంగా నమస్కరిస్తున్నారు. పైగా వధూవరులతో పాటు బంధువులు సైతం మాస్క్‌లు ధరించి వివాహ వేడుకకు హాజరయ్యారు. కొంపల్లిలోని చంద్రారెడ్డి గార్డెన్స్‌లో శుక్రవారం జరిగిన మణికాంత్‌రెడ్డి, పూజల వివాహ వేడుకలో ఈ సన్నివేశం కనిపించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారనడానికి ఈ చిత్రమే నిదర్శనంగా చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment