
Tamil Nadu groom slaps bride: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసినందుకు వరుడు తనను చెంపదెబ్బ కొట్టాడని ఓ వధువు ఆ పెళ్లిని రద్దు చేసుకుని అంతేనా అదే ముహూర్తంలో తన బంధువును పెళ్లి చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రిటీలో చోటుచేసుకుంది. పన్రుటికి చెందిన వధువు, పెరియకట్టుపాళయానికి చెందిన వరుడితో గతేడాది నవంబర్ 6న నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం జనవరి 20న కడంపుల్యూర్ గ్రామంలో జరగాల్సి ఉంది. వివరాల ప్రకారం.. జనవరి 19న వివాహానికి ముందు వధూవరుల బృందం మంటపానికి చేరుకున్నారు.
అనంతరం డీజేకు వధూవరులు ఆనందంగా డ్యాన్స్ చేశారు. అయితే, వధువు బంధువు జంట చేతులు పట్టుకుని వారితో కలిసి నృత్యం చేయడంతో విషయాలు గందరగోళంగా మారినట్లు సమాచారం. వధువు తన బంధువులతో కలిసి ఢీజేకి స్టెప్పులు వేస్తోంది. అది నచ్చని వరుడు వేదికపైకి వచ్చి అందరి ముందు వధువును చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.వధువు కూడా ఈ చర్యతో వివాహాన్ని వద్దని తన తల్లదండ్రులకి తెగేసి చెప్పింది. వధువు కుటుంబానికి వారి బంధువులలో తగిన వరుడిని చూసి ముందు అనుకున్న ముహూర్తానికి ఆమెకు పెళ్లి జరిపించారు.తిరస్కరించిన వరుడు పన్రుటి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పెళ్లి ఏర్పాట్ల కోసం తన కుటుంబం రూ. 7 లక్షలు ఖర్చు చేసి పరిహారం ఇప్పించాలని కోరినట్లు వరుడు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment