Groom Reach Marriage Venue In Jcb Shimla Video Goes Viral - Sakshi
Sakshi News home page

రోడ్డుపై మోకాల్లోతు మంచు.. మంటపానికి వరుడు ఏలా వెళ్లాడంటే!

Published Wed, Jan 26 2022 9:28 PM | Last Updated on Thu, Jan 27 2022 8:48 AM

Groom Reach Marriage Venue In Jcb Shimla Video Goes Viral - Sakshi

Heavy snowfall in Shimla: సాధారణంగా మంటపానికి వధూవరులు కారు మీద, గుర్రాల మీద చేరుకోవడం సహజమే. అయితే ఓ వరుడు మాత్రం జేసీబీ మీద మంటపానికి చేరుకున్నాడు. అయితే ఇదేదో సరదాకి అనుకున్నారంటే పొరపాటు. అసలు ఏం జరిగిందంటే!

మనం ప్రస్తుత శీతాకాలంలో చలికి గజగజ వణికిపోతున్నాం. అలాంటిది హిమాచల్‌ ప్రదేశ్‌ లాంటి ప్రాంతాల్లో చలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ మంచు ఏకంగా మోకాల్లోతు ఏర్పడుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడికి పెళ్లి జరగాల్సింది. అయితే మంచు కారణంగా రోడ్డుపై ప్రయాణం ఇబ్బందిగా మారింది. దీంతో అతను ఆ రోడ్డు పై వెళ్లేందుకు అనువుగా ఉంటుందని జేసీబీ బుక్‌ చేసుకుని వధువు ఇంటికి వెళ్లి అక్కడి నుంచి మంటపానికి చేరుకున్నాడు. ఆ తర్వాత చేయాల్సిన తతంగాన్ని పూర్తి చేశాడు. అనంతరం వధువు అదే జేసీబీలో ఎక్కించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement