వరుడి వేటలో అనుష్క
అందాల రాశి అనుష్క వరుడి అన్వేషణలో పడినట్లు తాజా సమాచారం. క్రేజీ హీరోయిన్లలో ప్రథమ స్థానంలో ఉన్న అనుష్క తెలుగు చిత్రం సూపర్ ద్వారా తెరంగేట్రం చేసి, తెలుగు, తమిళ భాషల్లో నటించారు. అయితే టాలీవుడ్ చిత్రం అరుంధతి నటిగా ఆమె కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. ఆ తరువాత అభినయం, అందం కలబోసిన నటనతో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న అనుష్క ప్రస్తుతం తెలుగులో బాహుబలి, రుద్రమదేవి చరిత్రాత్మక కథా చిత్రా ల్లో బలమైన పాత్రలను పోషిస్తున్నారు. త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సుందరాంగికి ఇప్పుడు పెళ్లిపై మనసు లాగుతోందట.
తనకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలో ఇప్పటికే నిర్ణయించుకున్న ఈ భామకు, వరుడి కోసం ఆమె కుటుంబ సభ్యులు వేట ప్రారంభించారట. పెళ్లైన తరువాత నటనకు స్వస్తి చెప్పనున్నట్లు ఇటీవల అనుష్క నర్మగర్భంగా వెల్లడించినట్లు ప్రచారంలో ఉంది. అనుష్క మాట్లాడుతూ, తెలుగు నటుడు నాగార్జున సూపర్ చిత్రంలో నటించే అవకాశం కల్పించకపోతే తాను హీరోరుున్ అయ్యే దానిని కాదన్నారు. అరుంధతితో తన కల నెరవేరిం దనే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నటిస్తున్న రుద్రమదేవి చిత్రం చాలా సంతృప్తినిచ్చిందన్నారు. ఈ విషయాలను తానెప్పటికీ గుర్తుంచుకుంటానని అనుష్క పేర్కొన్నారు. ఆమె మాటల్లో ఇక సినిమాకు దూరం అవుతున్నాననే కించిత్ బాధ కనపడుతోందంటున్నాయి సినీ వర్గాలు.