సాక్షి, సిద్దిపేట: పెళ్లి కట్టిన తోరణాలు వాడనే లేదు.. వివాహానికి వచ్చిన బంధువులు వెళ్లనే లేదు. అంతలోనే పెళ్లింట విషాదం నెలకొంది. వరుడు అకాల మరణం పొందాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే.. వరుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం వెంకటాపుర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం జరిగిన మరుసటి రోజే విద్యుత్ షాక్‌తో వరుడు మృతి చెందాడు. వెంకటాపూర్‌కు చెందిన నిరంజన్ సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా సిద్దిపేట పట్టణంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.
అయితే, నిరంజన్‌కు సోమవారం పెళ్లి రిసెప్షన్ జరగాల్సి ఉంది. కాగా, సోమవారం ఉదయం తాను ఉంటున్న ఇంటి వద్ద రిసెప్షన్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో లైటింగ్ తీగలు తగిలి కరెంట్ షాక్‌తో నిరంజన్ మృతిచెందాడు. దీంతో, ఎంతో ఆనందంగా ఉన్న పెళ్లింట విషాదం నెలకొనడంలో కుటంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు. జీవితాంతం తోడుంటానని మూడుముళ్లు వేసిన భర్త అకాల మరణంతో వధువు బోరున విలపిస్తోంది.
ఇది కూడా చదవండి: తీవ్ర విషాదం.. నాలాలో పడి మహిళ గల్లంతు..
Comments
Please login to add a commentAdd a comment