curent shock
-
పెళ్లింట విషాదం.. పెళ్లైన తెల్లారే ఇలా..
సాక్షి, సిద్దిపేట: పెళ్లి కట్టిన తోరణాలు వాడనే లేదు.. వివాహానికి వచ్చిన బంధువులు వెళ్లనే లేదు. అంతలోనే పెళ్లింట విషాదం నెలకొంది. వరుడు అకాల మరణం పొందాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే.. వరుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం వెంకటాపుర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం జరిగిన మరుసటి రోజే విద్యుత్ షాక్‌తో వరుడు మృతి చెందాడు. వెంకటాపూర్‌కు చెందిన నిరంజన్ సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా సిద్దిపేట పట్టణంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, నిరంజన్‌కు సోమవారం పెళ్లి రిసెప్షన్ జరగాల్సి ఉంది. కాగా, సోమవారం ఉదయం తాను ఉంటున్న ఇంటి వద్ద రిసెప్షన్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో లైటింగ్ తీగలు తగిలి కరెంట్ షాక్‌తో నిరంజన్ మృతిచెందాడు. దీంతో, ఎంతో ఆనందంగా ఉన్న పెళ్లింట విషాదం నెలకొనడంలో కుటంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు. జీవితాంతం తోడుంటానని మూడుముళ్లు వేసిన భర్త అకాల మరణంతో వధువు బోరున విలపిస్తోంది. ఇది కూడా చదవండి: తీవ్ర విషాదం.. నాలాలో పడి మహిళ గల్లంతు.. -
మద్యం మత్తులో వీరంగం.. అంతలోనే విషాదం
సాక్షి, జగిత్యాల : మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన వీరంగం చివరికి అతని ప్రాణాల మీదకు తెచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ యువకుడు పుటుగా మద్యం తాగి మత్తులో ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. రోడ్డుపై జనం చూస్తుండగానే కరెంట్‌షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ఓ యువకుడు ఆదివారం కావడంతో పూటుగా మద్యం సేవించాడు. అనంతరం సోగుకుంటూ వస్తూ రోడ్డుపై వెళ్లే వారి మీద రాళ్లు రువ్వాడు. పెద్దగా కేకలు పెడుతూ.. కాసేపు వీరంగం సృష్టించాడు. తమపై ఎక్కడ దాడి చేస్తాడనే భయంతో చుట్టపక్కనున్న ఎవరూ అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ యువకుడు వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
విద్యుదాఘాతానికి నాలుగేళ్ల బాలిక మృతి
సాక్షి, ఎస్‌ఎస్‌తాడ్వాయి: విద్యుదాఘాతానికి నాలుగేళ్ల బాలిక మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం పాతలింగాల గ్రామపంచాయతీ పరిధి బందాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బందాలకు చెందిన ఆగబోయిన సమ్మయ్య, స్వరూప దంపతులు తమ కుమార్తె అక్షిత(04)ను తీసుకొని తమ పత్తి చేను వద్దకు వెళ్లారు. భార్యాభర్తలు పత్తి ఏరే పనిలో నిమగ్నమవగా.. కూతురు చేనులో అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటోంది. ఈ క్రమంలో పంట భూమి నుంచి ఉన్న విద్యుత్ లైన్ తీగ తెగిపడి ఉంది. అక్షితకు కరెంట్ తీగ తగలగడంతో షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లముందే కూతురు మృత్యువాత పడడంతో కన్నవారి రోదనలు మిన్నుముట్టాయి. విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
పండగ పూట విషాదం
శ్రీకాకుళం, లావేరు: నాగులచవితి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పుట్టలో పాలు పోశాడు. ఆనక ఎప్పటిమాదిరిగానే మద్యం షాపులో పనిచేసేందుకు వెళ్లిపోయాడు. ఇంతలోనే విద్యుత్ షాక్‌కు గురై తమ కుమారుడు మృత్యువాత పడ్డాడన్న పిడుగులాంటి వార్త విని వారు శోకసంద్రంలోకి మునిగిపోయారు. ఈ విషాద ఘటన మండలంలోని బొడ్డపాడు గ్రామంలో ఆదివారం నెలకొంది. విద్యుత్ సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ ధనుంజయ్ నిర్లక్ష్యం వల్లేనని తమ కుమారుడు మృతి చెందాడని తండ్రి బాబూరావు లావేరు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ గ్రామానికి చెందిన ఆళ్ల కిశోర్(25)కు ఎటువంటి ఉద్యోగం రాకపోవడంతో ఆర్నెల్ల క్రితం బుడుమూరు గ్రామంలో ఓ మద్యం షాపులో పనికి కుదిరాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో నాగులచవితి పూజ చేసి, అనంతరం మద్యం షాపునకు వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇక్కడ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి మురపాక గ్రామానికి వెళ్తున్న హెచ్‌టీ విద్యుత్ లైన్ తీగలు తెగి పడ్డాయి. ఈ విషయాన్ని షిఫ్ట్ ఆపరేటర్‌కు కిశోర్ తెలియజేశాడు. మురపాక లైన్‌కు సరఫరా నిలిపివేస్తానని తెగిపడిన తీగలు పక్కకు తొలగించాలని షిఫ్ట్ ఆపరేటర్ సూచించాడు. ఆ విధంగా వేస్తున్న క్రమంలో విద్యుత్ సరఫరా చేశాడు. దీంతో కిశోర్ షాక్‌కు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. లావేరు ఏఎస్ఐ కృష్ణారావు, తన సిబ్బందితో వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ఎదిగొచ్చిన ఒక్కగానొక్క కొడుకు విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు బాబూరావు, ఊర్వశి కన్నీరుమున్నీరయ్యారు. వీరితోపాటు సోదరి, బంధువులు అతడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. గ్రామంలో అందరితో సన్నిహితంగా ఉండే యువకుడు మృతి చెందాడన్న వార్తతో గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. షిఫ్ట్ ఆపరేటర్ నిర్లక్ష్యం వల్లే.. తెగిపడిన విద్యుత్ తీగలు పూర్తిగా తీసివేశారా లేదా అని షిఫ్ట్ ఆపరేటర్ తెలుసుకోకుండానే సరఫరా ఇచ్చారని, ఈ కారణంగానే తమ కుమారుడు షాక్‌తో మృతి చెందాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మృతుడు తండ్రి డిమాండు చేశారు. -
ట్యూబ్‌లైట్ సరిచేస్తూ వ్యక్తి మృతి
రేగుల్లంక (అవనిగడ్డ) : ఇంట్లో ట్యూబ్‌లైట్ సరిచేస్తూ ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన రేగుల్లంకలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రేగుల్లంకకు చెందిన ఆరిగ మారయ్య (44) బుధవారం తన ఇంట్లో ట్యూబ్‌లైట్ వెలగకపోవటంతో సరిచేస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు వెంటనే అతడిని అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మారయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మారయ్య మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ కార్మికుడి మతి
మక్తల్ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మక్తల్ మండలం చందాపూర్‌కు చెందిన ఆంజనేయులుగౌడ్ (28) కొన్నాళ్లుగా ట్రాన్స్‌కోలో కాంట్రాక్ట్ కార్మికుడి (స్కిల్ లేబర్) గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఆదివారం ఉదయం సంగంబండలో స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘతానికి గురై అక్కడికక్కడే మతి చెందాడు. కాగా, ఈయనకు భార్య సుజాతతోపాటు తల్లిదండ్రులు పద్మమ్మ, వెంకటప్ప ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అనంతరం మతదేహాన్ని మక్తల్ సబ్‌స్టేషన్ ఎదుట రహదారిపై ఉంచి కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు డిమాడ్ చేశారు. దీంతో ఎస్ఐ మరళీగౌడ్, జెడ్పీటీసీ వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పగా శాంతించి వెనుదిరిగారు. -
పెనువిషాదం
విద్యుత్ షాక్‌కు గురై యువకుడి మృత్యువాత బంధువు మరణించడంతో చూసేందుకు వెళ్లగా ఘటన పెదతుమ్మిడిలో విషాద చాయలు పెదతుమ్మిడి(బంటుమిల్లి) : తమ బంధువు మరణించగా, చూసేందుకు వెళ్లిన ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు... పెదతుమ్మిడి గ్రామానికి చెందిన గొర్ల భూలక్ష్మి(50) అనారోగ్యం కారణంగా బుధవారం మరణించారు. భూలక్ష్మి మృతదేహాన్ని చూసేందుకు అదే గ్రామంలో నివసించే ఆమె బంధువు గాలం వీర్రాజు(30) వెళ్లాడు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులు వచ్చే వరకు భూలక్ష్మి మృతదేహాన్ని జాగ్రత్తగా ఉంచేందుకు ముదినేపల్లి మండలం శింగరాయపాలెం నుంచి మార్చురీ బాక్స్ తీసుకొచ్చారు. ఆ బాక్స్‌ను స్థానికులతో కలసి వీర్రాజు లోపల పెట్టాడు. ఆ తర్వాత కూడా అతను అక్కడే మార్చురీ బాక్స్‌పై చేయి వేసి నిలుచున్నాడు. మార్చురీ బాక్స్ వైర్లు సక్రమంగా కలపకుండానే విత్యుత్ స్విచ్ వేయడంతో వీర్రాజు షాక్‌కు గురయ్యాడు. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఈ విషయం తెలియడంతో అతని భార్య, తల్లి సొమ్మసిల్లిపడిపోయారు. వీర్రాజుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గ్రామ సర్పంచ్ సంపూర్ణ భర్త బొల్లా దుర్గాస్వామి తదితరులు వీర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రికల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బందరు తరిలించారు. -
విద్యుత్ వైర్లు తగిలి రైతు మృతి
గుంటూరు: పొలానికి వేసిన విద్యుత్ ఫెన్సింగ్ వైర్లు తగిలి రైతు దుర్మరణం చెందిన సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని బొల్లపల్లి మండలం పేరూరిపాడులో జరిగింది. పేరూరిపాడుకు చెందిన నర్సింహారావు రోజువారి పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఫెన్సింగ్‌కు వేసిన విద్యుత్ వైర్లు కాలికి తగిలి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. రైతు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.