
సాక్షి, జగిత్యాల : మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన వీరంగం చివరికి అతని ప్రాణాల మీదకు తెచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ యువకుడు పుటుగా మద్యం తాగి మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. రోడ్డుపై జనం చూస్తుండగానే కరెంట్‌షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ఓ యువకుడు ఆదివారం కావడంతో పూటుగా మద్యం సేవించాడు. అనంతరం సోగుకుంటూ వస్తూ రోడ్డుపై వెళ్లే వారి మీద రాళ్లు రువ్వాడు. పెద్దగా కేకలు పెడుతూ.. కాసేపు వీరంగం సృష్టించాడు. తమపై ఎక్కడ దాడి చేస్తాడనే భయంతో చుట్టపక్కనున్న ఎవరూ అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ యువకుడు వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment