విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్‌ కార్మికుడి మతి | Labour Dead off Current Shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్‌ కార్మికుడి మతి

Published Sun, Aug 14 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

ఆంజనేయులు మతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

ఆంజనేయులు మతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

మక్తల్‌ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ కాంట్రాక్ట్‌ కార్మికుడు మతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మక్తల్‌ మండలం చందాపూర్‌కు చెందిన ఆంజనేయులుగౌడ్‌ (28) కొన్నాళ్లుగా ట్రాన్స్‌కోలో కాంట్రాక్ట్‌ కార్మికుడి (స్కిల్‌ లేబర్‌) గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఆదివారం ఉదయం సంగంబండలో స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘతానికి గురై అక్కడికక్కడే మతి చెందాడు. కాగా, ఈయనకు భార్య సుజాతతోపాటు తల్లిదండ్రులు పద్మమ్మ, వెంకటప్ప ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అనంతరం మతదేహాన్ని మక్తల్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట రహదారిపై ఉంచి కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు డిమాడ్‌ చేశారు. దీంతో ఎస్‌ఐ మరళీగౌడ్, జెడ్పీటీసీ వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పగా శాంతించి వెనుదిరిగారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement