labour dead
-
రొయ్యల చెరువు వద్ద విద్యుత్ షాక్‌తో ఆరుగురు మృతి
-
లంకెవాని దిబ్బలో ఆరుగురు సజీవ దహనం
రేపల్లె (గుంటూరు)/సాక్షి, అమరావతి: పగలంతా కాయకష్టం చేసి ఆదమరిచి నిద్రిస్తున్న ఆరుగురు యువకులు నిశిరాత్రి వేళ అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదం నుంచి మరో నలుగురు తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బ గ్రామంలోని రొయ్యల చెరువుల వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని రాయగఢ్ జిల్లా గునుపూర్ మండలానికి చెందిన 25 మంది యువకులు లంకెవానిదిబ్బలోని మండలి బెయిలీ అనే వ్యక్తికి చెందిన రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు 15 రోజుల క్రితం వచ్చారు. చెరువుల వద్ద ఉన్న షెడ్లలోనే వారంతా మకాం ఉంటున్నారు. ఎప్పటిమాదిరిగానే గురువారం చెరువుల్లోని రొయ్యలకు మేత వేశారు. రాత్రి వారంతా భోజనాలు చేసి షెడ్లలోని రెండు గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి వేళ షెడ్లోని ఒక గదిలో అకస్మాత్తుగా పొగలు కమ్ముకుని పేలుడు సంభవించగా, అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ గదిలో 10 మంది నిద్రిస్తుండగా.. మంటల్లో చిక్కుకుపోయిన నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ æ(18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అదే గదిలో నిద్రిస్తున్న సునామో కజ్జీ, రాహుల్ సబార్, సంతోషి సబార్, అశోక్‌సబార్ బయటకు పరుగులు తీసి ప్రాణాలతో బయటపడ్డారు. పక్క గదిలో నిద్రిస్తున్న మరో 15 కూడా భయంతో పరుగులు తీశారు. ఘటన వెనుక అనుమానాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని కొందరు చెబుతుండగా.. ప్రమాదం జరిగిన గదిలో బ్లీచింగ్ బస్తాలు ఉన్నాయని, కూలీలు నిద్రపోయే సమయంలో మస్కిటో కాయిల్స్ వెలిగించారని.. వాటివల్ల ఆ గదిలోని బ్లీచింగ్ బస్తాలకు నిప్పంటుకుని ప్రమాదం సంభవించి ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. బ్లీచింగ్ బస్తాలు అంటుకుంటే పేలుడు ఎలా సంభవిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా బ్లీచింగ్ నిల్వ చేసిన గదుల్లో కూలీలు ఎలా నిద్రించగలరని, బ్లీచింగ్ వాసన ధాటికి తట్టుకోవడం కష్టమని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై శాస్త్రీయ పద్ధతుల్లో అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ చెప్పారు. చెరువుల యజమాని బెయిలీని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు. గవర్నర్ సంతాపం ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. ఆరుగురు యువకుల మరణంపై సంతాపం ప్రకటించిన గవర్నర్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఆరుగురి ఊపిరి తీసిన విషవాయువు
కోల్‌కతా: విషవాయువు పీల్చడంతో ఆరుగురు మృతి చెందిన విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. హజీనగర్‌లోని పేపర్ మిల్లులో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హజీనగర్‌లోని పేపర్ మిల్లులో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంపులను సరిచేసేందుకు ఇద్దరు కార్మికులు మిల్లు లోపల గల బావిలోకి దిగారు. మిల్లు నుంచి వెలువడే వ్యర్థాలతో నిండిన బావిలో విషవాయువు వెలువడటంతో వారు స్పృహ తప్పి పడిపోయారు. లోపలికి దిగినవారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారికి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని మరో నలుగురు కార్మికులు కూడా బావిలోకి దిగారు. కానీ వారు కూడా విషవాయువు బారిన పడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గమనించిన ఉద్యోగులు ఫైర్ బ్రిగేడ్‌ను అప్రమత్తం చేసి కార్మికులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషవాయువును అధికంగా పీల్చడంతో వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే.. పేపర్ మిల్లులోని వ్యర్థాలను బయటికి వదిలేందుకు సరైన వసతి లేకపోవడంతో బావిలోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. విషవాయులున్న బావిలోకి దిగిన కార్మికులకు గ్యాస్ మాస్కులు కూడా అందించలేదు. కనీస రక్షణ చర్యలు తీసుకోకుండా, కార్మికుల మృతికి కారణమైన మిల్లు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
రైల్వే ట్రాక్ పనుల్లో అపశ్రుతి
హైదరాబాద్ : నగరంలోని బాలనగర్ ఫిరోజ్‌గూడ రైల్వే ట్రాక్ పనుల్లో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ మట్టిపెళ్లలు విరిగిపడి ఓ రైల్వే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాద ఘటనపై అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు నాంపల్లి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ కార్మికుడి మతి
మక్తల్ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మక్తల్ మండలం చందాపూర్‌కు చెందిన ఆంజనేయులుగౌడ్ (28) కొన్నాళ్లుగా ట్రాన్స్‌కోలో కాంట్రాక్ట్ కార్మికుడి (స్కిల్ లేబర్) గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఆదివారం ఉదయం సంగంబండలో స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘతానికి గురై అక్కడికక్కడే మతి చెందాడు. కాగా, ఈయనకు భార్య సుజాతతోపాటు తల్లిదండ్రులు పద్మమ్మ, వెంకటప్ప ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అనంతరం మతదేహాన్ని మక్తల్ సబ్‌స్టేషన్ ఎదుట రహదారిపై ఉంచి కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు డిమాడ్ చేశారు. దీంతో ఎస్ఐ మరళీగౌడ్, జెడ్పీటీసీ వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పగా శాంతించి వెనుదిరిగారు. -
ఎన్టీపీసీలో పేలిన పైప్‌లైన్, కార్మికుడి మృతి
విశాఖ : విశాఖ జిల్లా పరవాడ ఎన్టీపీసీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాంట్రాక్ట్ కార్మికుడు కామేష్ మృతి చెందాడు. ఎన్టీపీసీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైప్‌లైన్ పేలటంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.