
డెహ్రాడూన్ : ఓ వయసుకు వచ్చాక ఎవరికైనా పెళ్లి అనగానే ఉత్సాహం ఉరకలెత్తిస్తుంది. కాబోయే భార్యను తొలిసారి చూడాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఉండే ఆతృతే వేరు. ఆమె ఎక్కడున్నా సరే రెక్కల గుర్రం వేసుకుని ఇట్టే వాలిపోవాలని కలలుకంటుంటారు. భారతీయ సమాజంలో వివాహానికి అంతటి అనుబంధం ఉంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ యువకుడి తనకు కాబోయే భార్య కోసం చేసిన పని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిమాలయ రాష్ట్రంలో గల చిమోలీ జిల్లా సమీపంలోని ఓ కుగ్రామం బిజ్రా. ఆ గ్రామానికి వెళ్లాలంటే కాళ్లకు పనిచెప్పాల్సింది. ఎటు చూసిన ఎత్తయిన మంచు పర్వతాలు తప్ప మరేమీ కనిపించవు. ఈ గ్రామానికి కనీసం వాహన సదుపాయం కూడా లేదు. నాలుగు కిలోమీటర్ల దూరంలో నుంచి కాలినడకన చేరుకోవాల్సింది.
అయితే ఓ యువకు ఈ గ్రామంలోని యువతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి ఆమెను తొలిసారి చూడటానికి ఏకంగా నాలుగు కిలోమీటర్లు నడక ద్వారా చేరుకున్నాడు. ఎత్తయిన మంచుకొండలు ఓ వైపు, పైనుంచి వర్షాన్ని తలపించేలా కురుస్తున్న హిమపాతం మరోవైపు ఇవేవీ అతన్ని ఆపలేకపోయాయి. చేతిలో రక్షణగా గొడుగులు పట్టుకుని ఈ హిమాలయ కొండలను ఛేదించుకుంటూ పెళ్లి కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు అతని స్నేహితులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రేయసి కోసం పాట్లు అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం ప్రపంచపు అత్యుత్తమ పెళ్లికొడుకు అని ప్రశంసిస్తున్నారు.