కితకితలు | Wedding Blues Drama at Lamakan | Sakshi
Sakshi News home page

కితకితలు

Published Wed, Oct 29 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

జాయింట్ వెకేషన్ నాటకంలోని ఓ సన్నివేశం

జాయింట్ వెకేషన్ నాటకంలోని ఓ సన్నివేశం

పెళ్లి ముహూర్తానికి రెండు నిమిషాలే ఉన్నా... బాత్‌రూమ్ నుంచి బయటకు రాదు పెళ్లి కూతురు. తల్లిదండ్రులు వచ్చి బతిమిలాడినా... ససేమిరా అంటుంది. పెళ్లికొడుకు, అతని పరివారానికి ఏం చెప్పాలో తెలియక, కూతుర్ని బాత్‌రూమ్ నుంచి ఎలా రప్పించాలో అర్థం కాక తలలు పట్టుకొంటారు పెళ్లి కూతురి తల్లిదండ్రులు. ఈ గందరగోళంలో ఏర్పడిన అయోమయంతో వచ్చిన ఆలోచనలు, చేష్టలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. డ్రామాటిక్ సర్కిల్ యాభై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా డీసీహెచ్ న్యూబీస్ పేరుతో బంజారాహిల్స్ లామకాన్‌లో ప్రదర్శించిన ‘వెడ్డింగ్ బ్లూస్’ నాటకంలోనిదీ సన్నివేశం.
 
 దీంతో పాటు ప్రదర్శించిన ‘జాయింట్ వెకేషన్’ నాటకం మరింతగా ఆకట్టుకుంది. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ వారి భార్యలతో కలిసి వెకేషన్‌కి వెళతారు. కాలికి దెబ్బ తగిలిన భార్యకు సాయం చేయటంలో అతను.. అతని ఫ్రెండ్, ఫ్రెండ్ వైఫ్ నానా తిప్పలు పడుతుంటారు. వెకేషన్ మూడ్ ఆవిరైపోయి, ఇంజరీ టైమ్ తినేస్తున్న నేపథ్యంలో రెండు జంటల మధ్య జరిగిన సన్నివేశాలు కితకితలు పెట్టాయి.
 - సాక్షి, సిటీ ప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement