పెళ్లిపీటలపై అరుదైన ఘటన | Karnataka: Newly Married Couple Open Book In Wedding Ceremony | Sakshi
Sakshi News home page

Karnataka: పెళ్లిపీటలపై అరుదైన ఘటన

Published Wed, Nov 24 2021 7:37 AM | Last Updated on Wed, Nov 24 2021 7:55 AM

Karnataka: Newly Married Couple Open Book In Wedding Ceremony - Sakshi

మండ్య(బెంగళూరు): ఈ ఇంటర్నెట్‌ యుగంలో మంగళవారం ఒక పెళ్లివేడుకలో వధూవరులు పుస్తకావిష్కరణ గావించి సాహిత్యానికి పెద్దపీట వేసిన అరుదైన ఘటన మండ్యలో చోటు చేసుకుంది. సాహితీవేత్త త.నా.శి. జగన్నాథ్‌ రచించిన పుస్తకాన్ని నూతన జంట వినుత– సంతోష్‌లు ఆవిష్కరించి అతిథులకు కానుకగా అందజేశారు.

మరో ఘటనలో..
పర్యావరణ రక్షణపై సమీక్ష 
హోసూరు: పర్యావరణ పరిరక్షణపై జిల్లా కేంద్రం క్రిష్ణగిరి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖాధికార్లతో సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్‌ జయచంద్రభానురెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శుద్ధీకరించిన తాగునీటి వినియోగం, పరిశ్రమల్లో కాలుష్య నివారణ, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడం, వర్షపునీరు నిల్వ ప్రాంతాల పరిరక్షణ వంటి విషయాలపై వివిద శాఖాధికార్లతో చర్చించారు. హోసూరు ఆర్డీవో తేన్‌మోళి, అధికారులు సెంథిల్‌ కుమార్, పరమశివం, వేడియప్పన్, మరియ సుందరం పాల్గొన్నారు. 

చదవండి: గ్రామంలో నాగుపాము కలకలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement