ఒకరితో నిశ్చితార్ధం.. మరొకరితో పెళ్లి..!  | Bride Runaway, Bride Groom Get Marriage another Woman In Chennai | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు పెళ్లికి శుభం కార్డు..!

Published Fri, Apr 6 2018 8:45 PM | Last Updated on Sat, Apr 7 2018 3:59 PM

Bride Runaway, Bride Groom Get Marriage another Woman In Chennai - Sakshi

సాక్షి, అన్నానగర్‌: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని మన పెద్దలు చెబుతుంటారు. అలంగుడిలో జరిగిన ఓ ఘటన అక్షరాల ఇది నిజమని చెబుతుంది. ఓ యువతి నిశ్చితార్ధం అయిన  తర్వాత అదృశ్యం కావడంతో.. మరో యువతి పెళ్లి కూతురైంది. ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడంతో శుభం కార్డు పడింది. వివరాలివి.. పుదుకోట జిల్లా ఆలంగుడికి చెందిన ఓ యువతికి కరమ్‌పక్కుడి తాలుకా గిత్తానిపట్టి షణ్ముగనాథన్‌ కుమారుడు నదీష్ కి  ఏప్రిల్‌ 4న పెళ్లి నిశ్చయమైంది.

ఏప్రిల్‌ 3వ తేదీన పెళ్లి కూతురు హఠాత్తుగా అదృశ్యమైంది. దీంతో వరుడి బంధువులు ఎలాగైనా పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ యువతి తండ్రి కార్తీక్‌ వివాహనికి ఒప్పుకోవడంతో ఏప్రిల్‌ 3వ తేదీ రాత్రే నిశ్చితార్ధం చేశారు. అదే మూహూర్తంలో కుమారమలై మురుగన్‌ సన్నిధిలో నదీష్‌కి, దేవదర్శినికి పెద్దలు వివాహం జరిపారు. పెళ్లికి ఒప్పుకున్న దేవదర్శినిని బంధువులు, స్నేహితులు ఆశీర్వదించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement