పెళ్లిలో సరిపడా మద్యం పోయ్యలేదని వరుడి హత్య | Crime News in Telugu | Groom Killed For He Not Provide Enough Wine - Sakshi
Sakshi News home page

వరుడి హత్య; యూపీలో దారుణం

Published Thu, Dec 17 2020 11:16 AM | Last Updated on Thu, Dec 17 2020 2:11 PM

UP Groom Stabbed to Death For Refuses Alcohol to Friends at Wedding - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లై 24 గంటలు కూడా గడవకముందే వరుడు దారుణ హత్యకు గురయ్యాడు. సరిపడా మద్యం పొయ్యలేదనే కారణంతో స్నేహితులే వరుడిని పొడిచి చంపేశారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌ పాలిముకిమ్ పూర్ గ్రామానికి చెందిన బబ్లూ(28) అనే వ్యక్తికి సోమవారం వివాహం జరిగింది. స్నేహితుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాడు చేశాడు. వివాహం పూర్తయిన తర్వాత రాత్రి తన స్నేహితులను కలుద్దామని వెళ్లాడు బబ్లూ. అప్పటికే ఫుల్లుగా తాగి ఉ‍న్న అతడి స్నేహితులు తమకు మరింత మద్యం కావాలని బబ్లూని అడిగారు. అందుకు అతడు అంగీకరించకపోవడంతో వారి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. మాట మాట పెరిగింది. (వధువును పట్టుకులాగిన వరుడి ఫ్రెండ్స్‌: పెళ్లి క్యాన్సిల్‌)

అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న బబ్లూ స్నేహితులు విచక్షణ కోల్పోయి కత్తితో అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బబ్లూని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఈలోపే అతడు మరణించాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రామ్‌ఖిలాడ్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement