Vijayanagara Crime News: Jilted lover Decapitates Girl Surrenders PS With Severed Head - Sakshi
Sakshi News home page

Crime News: ప్రేమించానంటూనే నరరూప రాక్షసుడిలా..

Published Fri, Jul 22 2022 11:26 AM | Last Updated on Fri, Jul 22 2022 11:56 AM

Jilted lover Decapitates Girl Surrenders PS With Severed Head - Sakshi

సాక్షి,బళ్లారి: ప్రేమించానన్నాడు. ప్రాణంగా చూసుకుంటానన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. పైగా ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. దీంతో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయినా సుఖంగా మాత్రం లేడు. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగలేదని, ఆమె వేరొకరి సొంతం కాకూడదని రగిలిపోయాడు. చివరికి.. నరరూప రాక్షసుడిలా మారిపోయి ఘోరానికి పాల్పడ్డాడు. 

మాజీ ప్రేయసి తల నరికి హత్య చేయడంతో పాటు.. మొండెం నుంచి ఆమె తలను వేరు చేశాడు ఓ ఉన్మాది. నేరుగా పోలీసు స్టేషన్‌కు ఆ తలను తీసుకెళ్లాడు. వెన్నులో వణుకుపుట్టించే ఈ ఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో సంచలనం రేకెత్తించింది. 

గురువారం విజయనగర జిల్లా కూడ్లిగి  తాలూకా కేబీ హట్టి (కన్నబోరయ్యనహట్టి) గ్రామంలో  నిర్మలా (23) అనే అమ్మాయిని.. భోజరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. యువతి తలను పోలీసు స్టేషన్‌కు తీసుకుని వచ్చి లొంగిపోయారు.

నిర్మల బీఎస్‌సీ నర్సింగ్‌ చదువుతోంది. పరీక్షలు ఉన్న కారణంగా స్వంత ఊరులో చదువుకోవడానికి వచ్చింది. మాట్లాడాలని పిలిచి ఆమెను కిరాతకంగా హత్య చేశాడు భోజరాజు. కొన్నాళ్ల కిందట ‍ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని ఆమె వెంటపడ్డాడు. స్నేహం ముసుగులోని అతని ప్రేమను ఆమె ఒప్పుకోలేదు. పంచాయితీ పెట్టి పెద్దలతో పెళ్లి కుదర్చాలని ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వేరే యువతిని రెండు నెలల కిందట వివాహం చేసుకున్నాడు కూడా. అయితే.. నిర్మలను కిరాతకంగా హతమార్చిన ఉన్మాదిని నడిబజారులో ఉరితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై కూడ్లిగి తాలూకా ఖానాహొసళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement