
పూజా రాణి (ఫైల్)
సాక్షి, హైదరాబాద్ (అంబర్‌పేట): షాపుకు వెళ్లొస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదశ్యమైంది. ఈ సంఘటన గురువారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో నివసించే మధుకర్ కుమార్తె పూజారాణి(20) ఇంట్లోనే ఉంటుంది.
గత కొంత కాలంగా నిరంతరాయంగా ఫోన్‌లోనే మాట్లాడుతుండేది. ఇది సరైన పద్ధతి కాదని వారించినా వినలేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం షాపుకు వెళ్లొస్తానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి..)
Comments
Please login to add a commentAdd a comment