సాక్షి, హైదరాబాద్: హోమ్ ట్యూషన్ చెప్పేందుకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లికి చెందిన శ్రీశైలం, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా రెండో కుమార్తె సారిక(22) బీ–ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతూ హోమ్ ట్యూషన్స్ చెబుతోంది.
గత నెల 30వ తేదీన 7 గంటలకు ట్యూషన్ చెప్పేందుకు వెళ్లిన సారిక ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతకగా ఫలితం లేకుండాపోయింది. ఆమె మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. అయితే తన అక్క మొబైల్ ఫోన్‌కు అఖిల్ వచ్చాడని సారిక వాట్సాప్ మెసేజ్ పెట్టిందని, ఆ తరువాత ఫోన్ స్విచ్ఛాప్ పెట్టిందని, అతడిపై అనుమానం ఉందంటూ యువతి తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (అసభ్య చిత్రాలను వీడియోలుగా తీసి.. కోట్ల రూపాయల సంపాదన)
Comments
Please login to add a commentAdd a comment