
కల్యాణి (ఫైల్)
బంజారాహిల్స్ (హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై అంబిక తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ బుడగ జంగం బస్తీలో నివసించే రెడ్డిబోయినోల కల్యాణి(21) బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 9వ తేదీ ఉదయం ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిన ఆమె ఈనెల 11వ తేదీ వరకు కూడా తిరిగి రాలేదు.
దీంతో ఆమె తల్లి ఈనెల 12వ తేదీన ఆస్పత్రికి వచ్చి కూతురి కోసం వాకబు చేసింది. అయితే ఆమె 9వ తేదీన జీతం తీసుకొని వెళ్లిపోయిందని తిరిగి రాలేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ నం. 95531 25593లో సంప్రదించాలని తెలిపారు.
చదవండి: (ఊహించని అద్భుతం: తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్ చేద్దామనుకున్నారు..)
Comments
Please login to add a commentAdd a comment