
సాక్షి, ఎర్రవల్లిచౌరస్తా: ఇటిక్యాల మండలంలోని కొండేరులో యువతి అదృశ్యమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోకారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొండేరు చెందిన డక్కలి కోటమ్మ, హనుమంతు దంపతుల చిన్న కుమార్తె రాణికి కుటుంబసభ్యులు కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలిపారు.
ఆమెకు ఇష్టం లేకపోవడంతో బుధవారం ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూలీ పనులకు వెళ్లగా ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా తమ కూతురు లేకపోవడంతో ఆరా తీయగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. గురువారం తల్లి ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment