
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, విజయవాడ: విజయవాడ గుణదలలో అమ్మాయిల అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. అదృశ్యమైన వారిలో ఒకరు మైనర్‌గా ఉన్నట్టు సమాచారం. ఈ నెల 4న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలవడానికి వెళ్లినప్పటి నుంచి తమ పిల్లలు కనిపించడం లేదని ఆ అమ్మాయిల తల్లి కోటా జ్యోతి మాచవరం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేను కలవడానికి వెళ్లినవారు ఇంకా తిరిగిరాలేదని, వారి నుంచి ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదని, ఫోన్ చేస్తుంటే స్విచ్చాఫ్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన బిడ్డల ఆచూకీ చెప్పాలని జ్యోతీ పోలీసులను వేడుకున్నారు.
గతంలో వీరిపైనై అత్యాచారాయత్నం
అదృశ్యమైన ఈ అమ్మాయిలపైనే గతంలో ఎమ్మెల్యే బొండా ఉమ అనుచరులు అత్యాచారయత్నం చేశారు. పక్కాగృహం ఇప్పిస్తామని నమ్మించి ఎమ్మెల్యే ఆఫీస్‌కు తీసుకెళ్లి మరీ ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ కేసులో అప్పట్లోనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి తమకు వేధింపులు ఎక్కువయ్యాయని జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment