కడితి శిరీష ,కడితి అరుణ
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): కంచరపాలెం కప్పరాడ రాంజీ ఎస్టేట్‌లో నివాసముంటున్న ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కప్పరాడ రాంజీ ఎస్టేట్‌లో నివాసముంటున్న కడితి నాగ కనక అప్పారావు, కడితి సుధారాణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె కడితి శిరీష(18), రెండో కుమార్తె కడితి అరుణ(16) జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ, ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఈ నెల 12న శనివారం సెయింట్ జోసెఫ్ కళాశాలకు హాల్ టికెట్ల కోసం వెళ్లారు.
హాల్ టికెట్లు తీసుకున్న తర్వాత వీరు మళ్లీ తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇళ్లలో కుటుంబ సభ్యులు వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో తల్లి సుధారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాఇంటికి సమీపంలో ఉన్న నలుగురు యువకులపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తగిన విచారణ చేసి కుమార్తెల ఆచూకీ కనిపెట్టాలని కోరారు. దీనిపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment