హైదరాబాద్‌లో సీసీఎస్‌ ఎస్సై ఆత్మహత్య | CCS SI Saidulu Has Committed Suicide In Amberpet | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సీసీఎస్‌ ఎస్సై ఆత్మహత్య

Published Mon, Dec 23 2019 11:04 AM | Last Updated on Mon, Dec 23 2019 1:47 PM

CCS SI Saidulu Has Committed Suicide In Amberpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీసీఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్న సైదులు గౌడ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అంబర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అతని భార్య నిర్మల పిల్లల్ని స్కూల్‌లో దించడానికి వెళ్లిన సమయంలో సైదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే సైదులు ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియలేదు. కాగా, ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement