
సాక్షి, అంబర్‌పేట: మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. అంబర్‌పేట ముసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలో వరద ఉధృతిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకుపోతున్నట్లు కనిపించింది. ప్రవాహంలో మృతదేహం కొట్టుకుపోతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. వరద ఉధృతిలో మృతదేహం కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఘట్‌కేసర్ వైపు మృతదేహం కొట్టుకుపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment