rain flow
-
క‘న్నీటి’ రాత్రి: ఏడాది గడిచినా మానని గాయాలు
సాక్షి, శంషాబాద్: అది ఓ కాళ రాత్రి.. ఇంకా చెప్పాలంటే కొన్ని కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది ఆ రాత్రి. వందేళ్ల తర్వాత నగర చరిత్రలో అతి భారీ వర్షం కురిసి గతేడాది అక్టోబరు 13న నగర శివారులోని పలు ప్రాంతాలను నిలువునా ముంచేసింది. కొందరు ప్రాణాలను కోల్పోతే మరికొందరికి నిలువున నీడలేకుండా చేసింది. చదవండి: భూమ్మీదే కాదు.. అక్కడా వరదలు ముంచెత్తాయి! కుండపోతగా వర్షం నగరంతో పాటు రాజేంద్రనగర్ ప్రాంతంలో 25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలతో గగన్‌పహాడ్‌లోని అప్పాచెరువు తెగి దిగువ ప్రాంతమైన ఫకీర్ గుట్టలో నివాసం ఉంటున్న సాధిక్ కుటుంబంలో ఒకరు మినహా మిగిలిన వారంతా మృతిచెందారు. రెండు బస్సులు, పదికి పైగా కార్లు వరదలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. చదవండి: బ్లేడ్‌తో చేయి కోసుకుని, తల పగులగొట్టుకొని, కప్పు పెంకులు నమిలి.. దెబ్బతిన్న జాతీయ రహదారి 44వ జాతీయ రహదారి సైతం వరద ఉదృతితో పూర్తిగా దెబ్బతింది. గతంలో ఎన్నడు లేనంతగా రహదారిపై తొలిసారి రాకపోకలను రెండు రోజులపాటు నిషేదించి ప్రత్యామ్నాయ మార్గాలవైపు వాహనాలను అధికారులు దారి మళ్లించారు. అదృశ్యమైన విదేశీయుడు అర్థరాత్రి సమయంలో మెహిదీపట్నం నుంచి క్యాబ్‌లో బయలుదేరిన సుడాన్ దేశీయుడు మహ్మద్ మావియా గగన్‌పహాడ్ వరద ఉధృతిలోనే కొట్టుకుపోయినట్లు అతడి స్నేహితులు అనుమానిస్తున్నారు. తమ స్నేహితుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరలేదని అతడిఫోన్ కూడా స్విచ్ఛాప్ అయిందని ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కూడా నేటి వరకు అతడి గురించి స్పష్టమైన సమాచారం దొరకకపోవడంతో మిస్సింగ్ కేసుగానే ఉండిపోయింది. చదవండి: ‘పండగ పూటా పస్తులేనా?.. మేమేం పాపం చేశాం’ -
మూసీ ప్రవాహంలో మృతదేహం కలకలం
సాక్షి, అంబర్‌పేట: మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. అంబర్‌పేట ముసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలో వరద ఉధృతిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకుపోతున్నట్లు కనిపించింది. ప్రవాహంలో మృతదేహం కొట్టుకుపోతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. వరద ఉధృతిలో మృతదేహం కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఘట్కేసర్ వైపు మృతదేహం కొట్టుకుపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
కుమ్మేసిన కుండపోత: వైరలవుతోన్న ఫోటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గురువారం రాత్రి పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. కూకట్పల్లి, బాలానగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి నగర్, షాపూర్‌నగర్, మూసాపేట, అమీర్‌పేట, మైత్రీవనం, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, సరూర్‌నగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, పంజాగుట్ట మెట్రో, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, రాజ్‌భవన్ రోడ్ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్, ఖైరతాబాద్, హబ్సిగూడ, టోలిచౌకి, సికింద్రాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. రాత్రి 7.50 నుంచి 9 గంటల వరకు కుంభవృష్టి కుమ్మేసింది. వరదనీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాత్రి 11 గంటల వరకూ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రోడ్డు క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నగరంలో సుమారు వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 11 గంటల వరకు జూబ్లీహిల్స్‌లో 9.8, మూసాపేటలో 9.6, చందానగర్‌లో 8.8, సరూర్‌నగర్‌లో 8.3, మోతీనగర్‌లో 7.9, మాదాపూర్‌లో 7.7, యూసఫ్‌గూడలో 7.6, బాలానగర్‌లో 7.1, చాంద్రాయణగుట్టలో 6.9, శ్రీనగర్ కాలనీలో 6.8, ఫాతిమానగర్‌లో 6.5, ఎల్బీనగర్లో 6.3, రంగారెడ్డి నగర్లో 5.9, జీడిమెట్లలో 5.8, ఆసిఫ్‌నగర్, కేపీహెచ్‌బీలలో 5.7, గాజులరామారంలో 5.4, అత్తాపూర్‌లో 4.5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది. రంగంలోకి జీహెచ్ఎంసీ బృందాలు జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచి నీటిని తోడివేశాయి. డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల కోసం 040 21111111 నంబర్‌కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఇళ్లలోంచి బయటికి రావద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Watch 😱😱 #hyderabadrain #hyderabadflood #heavyrains @HiHyderabad @HiWarangal @balaji25_t @HYDmeterologist pic.twitter.com/8JMkPvlTBd — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) September 2, 2021 It’s not #istanbul means Old City of #Hyderabad it’s #Dallas of #Telangana #YousufGuda #KrishnaNagar #HyderabadRains pic.twitter.com/lIjQRhCxZK — Mubashir.Khurram (@infomubashir) September 2, 2021 #hyderabadrain #hyderabadflood#hyderabad #StayHomeStaySafe@HiWarangal @HiHyderabad @DonitaJose pic.twitter.com/yFNrlek4VV — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) September 2, 2021 -
దంచికొడుతున్న వానలు.. పొంగుతున్న వాగులు, వంకలు
వాగులకు జలకళ కోస్గి: మండలంలో మూడు రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో పాటు ముశ్రీఫా, బిజ్జారం వాగుల్లో నూతనంగా నిర్మించిన చెక్ డ్యాంల్లో వర్షం నీరు నిలిచి వాగులకు జలకళ సంతరించుకుంది. ముశ్రీఫా వాగులో చెక్ డ్యాం నిండి పైనుంచి నీటి ప్రవాహం మొదలైంది. బిజ్జారం వాగులో సైతం చెక్ డ్యాం వరకు నీరు చేరింది. సోమవారం రాత్రి మండలంలో 4.1 సెం.మీ వర్షం నమోదు కాగా ముశ్రీఫా, బిజ్జారం చెక్ డ్యాంల నిర్మాణంతో ముంగిమళ్ల, కొత్తపల్లి వాగులు నీటి ప్రవాహంతో ఆకట్టుకున్నాయి. రెండు రోజుల ముందు నుంచే మండలంలోని ముంగిమళ్ల రామస్వామి కత్వ అలుగు పారడంతో పాటు ముశ్రీఫా చెక్ డ్యాం సైతం అలుగుపారడంతో ఈ దృశ్యాల్ని చూసేందుకు మండల ప్రజలు తరలివెళ్తున్నారు. సాక్షి, సిరికొండ(బోథ్):వాననీటిని ఒడిసి పట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. చినుకులా రాలిన నీటి బిందువులు ఏకమై వరదలా పారుతూ వాగుల ద్వారా చెక్‌డ్యామ్‌లలోకి చేరుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిరికొండ మండలంలో నిర్మించిన చెక్‌డ్యాం నిండి ఇలా మత్తడి పోస్తోంది. మత్తడి దుముకుతున్న ‘భద్రకాళి’ సాక్షి, వరంగల్: నగరంలోని చారిత్రక భద్రకాళి చెరువు పరవళ్లు తొక్కుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారింది. మంగళవారంనుంచి చెరువు మత్తడి పోస్తోంది. నగరవాసులు ఈ దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు. కొంతమంది ఫొటోలు దిగారు. మరికొందరు ఈత కొట్టారు. మోగి తుమ్మెద వాగుకు జలకళ నంగునూరు(సిద్దిపేట): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంగునూరు మండలం గుండా పారే మోగి తుమ్మెద వాగు జలకళ సంతరించుకుంది. సోమవారం కురిసిన వర్షానికి వాగు పరివాహక ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు చేరింది. మంగళవారం ఉదయం ఖాత గ్రామంలో నిర్మించిన చెక్‌డ్యాం నిండి మత్తడి పారింది. ఘణపూర్ వద్ద నిండిన చెక్‌డ్యాం సింగూరుకు జలకళ సాక్షి, సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈసారి వర్షాలు బాగా కురిసి ప్రాజెక్ట్ పూర్తిగా నిండితే యాసంగికి ఎలాంటి డోకా ఉండదని రైతులు మురిసిపోతున్నారు. కెనాల్ ద్వారా సాగుకు నీళ్లు అందుతాయనే ఆనందంలో ఉన్నారు. తుకం పోసి వరి నాట్లకు సిద్ధమయ్యారు. వర్షాలు సరిగా కురిసినా.. కురవకపోయినా ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండితే చాలని పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.982 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 2,593 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, 386 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో అవుతోంది. సోమవారం కురిసిన వర్షానికి 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఏఈ మదర్ తెలిపారు. రెండు మూడు రోజులు ఇలాగే వర్షం కురిస్తే జలాశయం పూర్తి సామర్థ్యం చేరుకోవచ్చని ఇరిగేషన్ ఈఈ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. -
ఆల్మట్టికి కొనసాగుతున్న వరద
– ఎగువప్రాంతం నుంచి తగ్గిన ఇన్‌ఫ్లో – 23 క్రస్ట్‌గేట్లు మూసివేత – రేపు సాయంత్రానికి జూరాలకు కృష్ణమ్మ? జూరాల: కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరదకొనసాగుతోంది. ఆదివారం 1,88,632 క్యూసెక్కుల వరదనీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 112.52 టీఎంసీలకు చేరింది. ఎగువనుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో శనివారం తెరిచిన 23 క్రస్టుగేట్లను ఆదివారం ఉదయం 9.30గంటలకు పూర్తిగా మూసివేశారు. ప్రాజెక్టు జలవిద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులను దిగువప్రాంతానికి వదులుతున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్‌కు 1,11,784 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు కాగా ప్రస్తుతం 24.34 టీఎంసీలకు చేరింది. ఆదివారం రాత్రిలోగా నారాయణపూర్ ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వకు చేరే అవకాశముంది. సోమవారం ఉదయం ప్రాజెక్టు ప్రధాన కాలువలు, విద్యుదుత్పత్తి, క్రస్టుగేట్ల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నారాయణపూర్ నుంచి విడుదలయ్యే కృష్ణానది వరద 100 కిలోమీటర్ల దిగువన ఉన్న మన రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు మంగళవారం సాయంత్రంలోగా చేరే అవకాశం ఉందని తెలిపారు.జూరాలలో ప్రస్తుతం 3.58 టీఎంసీల నీళ్లు నిలిపారు. తుంగభద్ర ప్రాజెక్టులో ప్రస్తుతం 37.47 టీఎంసీలు నిల్వ చేశారు.