వరదనీటిలో మునిగిన అప్పాచెరువు పరివాహక ప్రాంతం
సాక్షి, శంషాబాద్: అది ఓ కాళ రాత్రి.. ఇంకా చెప్పాలంటే కొన్ని కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది ఆ రాత్రి. వందేళ్ల తర్వాత నగర చరిత్రలో అతి భారీ వర్షం కురిసి గతేడాది అక్టోబరు 13న నగర శివారులోని పలు ప్రాంతాలను నిలువునా ముంచేసింది. కొందరు ప్రాణాలను కోల్పోతే మరికొందరికి నిలువున నీడలేకుండా చేసింది.
చదవండి: భూమ్మీదే కాదు.. అక్కడా వరదలు ముంచెత్తాయి!
కుండపోతగా వర్షం
నగరంతో పాటు రాజేంద్రనగర్ ప్రాంతంలో 25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలతో గగన్‌పహాడ్‌లోని అప్పాచెరువు తెగి దిగువ ప్రాంతమైన ఫకీర్ గుట్టలో నివాసం ఉంటున్న సాధిక్ కుటుంబంలో ఒకరు మినహా మిగిలిన వారంతా మృతిచెందారు. రెండు బస్సులు, పదికి పైగా కార్లు వరదలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు.
చదవండి: బ్లేడ్‌తో చేయి కోసుకుని, తల పగులగొట్టుకొని, కప్పు పెంకులు నమిలి..
దెబ్బతిన్న జాతీయ రహదారి
44వ జాతీయ రహదారి సైతం వరద ఉదృతితో పూర్తిగా దెబ్బతింది. గతంలో ఎన్నడు లేనంతగా రహదారిపై తొలిసారి రాకపోకలను రెండు రోజులపాటు నిషేదించి ప్రత్యామ్నాయ మార్గాలవైపు వాహనాలను అధికారులు దారి మళ్లించారు.
అదృశ్యమైన విదేశీయుడు
అర్థరాత్రి సమయంలో మెహిదీపట్నం నుంచి క్యాబ్‌లో బయలుదేరిన సుడాన్ దేశీయుడు మహ్మద్ మావియా గగన్‌పహాడ్ వరద ఉధృతిలోనే కొట్టుకుపోయినట్లు అతడి స్నేహితులు అనుమానిస్తున్నారు. తమ స్నేహితుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరలేదని అతడిఫోన్ కూడా స్విచ్ఛాప్ అయిందని ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కూడా నేటి వరకు అతడి గురించి స్పష్టమైన సమాచారం దొరకకపోవడంతో మిస్సింగ్ కేసుగానే ఉండిపోయింది.
చదవండి: ‘పండగ పూటా పస్తులేనా?.. మేమేం పాపం చేశాం’
Comments
Please login to add a commentAdd a comment