సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతోంది.. వాహనంపై పడిన చలాన్లను కూడా సక్రమంగా చెల్లించడం లేదు. భాగ్యనగరంలో సగానికి పైగా మంది సక్రమంగా చలాన్లను చెల్లించడం లేదు .దీంతో ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ఉల్లంఘన పేరుతో వాహనదారుల నుంచి ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కాచిగూడట్రాఫిక్ పోలీసులు సోమవారం అంబర్‌పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టారు.
ట్రాఫిక్ పోలీసులను చూసిన ఓ వాహనదారుడు రోడ్డుపైనే బైక్ వదిలి పారిపోయాడు. అయితే వదిలి వెళ్లిన AP 23 M 9895 హీరో హోండా ప్యాషన్ బైక్‌పై పోలీసులు చలాన్లు ఉన్నాయో లేవో అని తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ బైక్ ఏకంగా 179 చలాన్లు, 42,475 రూపాయల ఫైన్ ఉండటం చూసి పోలీసులు అవాక్కయ్యారు. భారీ చలాన్లు ఉండటంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు.
(చదవండి: వివాహేతర సంబంధం.. అర్ధరాత్రి ప్రియుడి ఇంట్లో ఘర్షణ..)
Comments
Please login to add a commentAdd a comment