బదిరుల హాస్ట్‌ల నుంచి విద్యార్థుల పరారీ | 3 Students Escaped From Amberpet Model School For The Deaf | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 21 2018 1:41 PM | Last Updated on Wed, Nov 21 2018 3:05 PM

3 Students Escaped From Amberpet Model School For The Deaf - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అబ్దుల్లాపూర్‌ మెట్‌, పెద్ద అంబరపేట బదిరుల ఆదర్శ పాఠశాల హాస్టల్‌ నుంచి ముగ్గురు విద్యార్థులు పరారీ అయ్యారు. వివరాలు.. చిన్నారులు మహేష్‌, లోకేశ్‌, యశ్వంత్‌ బదిరుల హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో హాస్టల్‌లో తమను వేధిస్తున్నారంటూ వీరు ముగ్గురు ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చారు. వీరిలో మహేష్‌, లోకేశ్‌ ఇద్దరు కలిసి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వెంట నడచుకుంటూ వెళ్తుండగా చూసిన స్థానికులు వారిని అడ్డగించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

చెవిటివారైన ఆ పిల్లలు తమ సైగలతో హాస్ట్‌ల్‌లో తమను వేధిస్తున్నారని.. అందుకే ఇలా బయటకు వచ్చామని వారికి తెలిపారు. దాంతో స్థానికలు వీరిని కోహెడ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. మరో విద్యార్థి యశ్వంత్‌ ఆచూకీ మాత్రం తెలియలేదు. ఈ లోపు పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్‌, ముగ్గురు విద్యార్థులు హాస్టల్‌ నుంచి పరారయ్యరంటూ మెట్టూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement