హైదరాబాద్: ఓ యువతి అదశ్యమైన సంఘటన అంబర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అంజద్ కథనం ప్రకారం...అంబర్‌పేట్ రామకష్ణనగర్‌కు చెందిన నారాయణ కుమార్తె ప్రణీత(22) బాగ్‌లింగపల్లిలోని ఓ ప్రై వేట్ ఇనిస్టిట్యూట్‌లో స్పొకెన్ ఇంగ్లీష్ కోర్సులో శిక్షణ తీసుకుంటుంది. కాగా ప్రణిత ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లింది. అయితే, రాత్రి 9 వరకు ఇంటికి చేరుకోవాల్సి ఉండగా చేరుకోలేదు. ఆందోళన చెందిన కుంటుంబ సభ్యులు పలుచోట్ల వెతికిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో గురువారం కుంటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.