అంబర్ పేట్: వివాహ వేడుకలో విషాదం | Amberpet: Wall of marriage hall collapses, four dead | Sakshi
Sakshi News home page

ఫంక్షన్‌ హాల్‌లో కూలిన గోడ, నలుగురు మృతి

Published Sun, Nov 10 2019 4:04 PM | Last Updated on Sun, Nov 10 2019 8:13 PM

Amberpet: Wall of marriage hall collapses, two dead - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శిధిలావస్థకు చేరిన ఫంక్షన్‌ హాల్‌కు ఆధునిక హంగులు అద్దుతున్న నిర్వాహకులు దాని మధ్యలో ఓ భారీ గోడ నిర్మించారు. పునాది, బీమ్‌ లేకుండా నిర్మించిన ఆ గోడ ఆదివారం హఠాత్తుగా కూలిపోయింది. అదే సమయంలో ఓ వివాహ వేడుక జరుగుతుండటంతో తీవ్ర కలకలం రేగింది. ఆ శిధిలాల కింద చిక్కుకున్న ఓ మహిళ అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. క్షతగాత్రులుగా మారి, ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన మరో ముగ్గురు చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరికొందరికి గాయాలు కాగా... ఆటో సహా అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ విషాదకర ఘటన అంబర్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని గోల్నాకలో చోటు చేసుకుంది.

పోలీసులు, ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం... కాచిగూడకు చెందిన హర్షద్‌హడ్డ గోల్నాకలో పెరల్‌ గార్డెన్‌ పేరిట ఫంక్షన్‌హాల్‌ నిర్వహిస్తున్నాడు. కాగా నల్లకుంట నర్సింహ బస్తికి చెందిన కొండూరు సదానందం, లిలిత దంపతుల నాల్గొవ కుమార్తె స్వప్నను మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం యాన్మగండ్ల గ్రామానికి చెందిన జంగయ్య, అంజమ్మ కుమారుడు చంద్రశేఖర్‌తో  ఆదివారం 11.49 గంటలకు పెళ్లి మూహూర్తం కుదిరింది. వీరి వివాహం నిర్వహించేందుకు గోల్నాకలో ఉన్న పెరల్‌ గార్డెన్‌ను బుక్‌ చేశారు. వివాహం కోసం వధూవరులతో పాటు బందువులంతా వివాహ వేడుకలకు హజరయ్యారు. వివాహం జరిగి తలంబ్రాల తంతు ముగిస్తుండగా బంధువులు భోజనాలకు బయలుదేరారు. 

భారీ శబ్దంతో...
వధూవరుల వేదిక వైపు ఉన్న భారీ గోడ పెద్ద శబ్దంతో బయటకు పడిపోయింది. అప్పుడే  పెళ్లికి వచ్చిన కొంతమంది లోపలికి వెళ్తుండగా మరికొంత మంది వేదిక గోడ వద్ద వేచి చూస్తున్నారు. భారీ గోడ కుప్పకూలి వారిపై పడింది. అక్కడే ఉన్న నర్సింహ బస్తికి చెందిన విజయలక్ష్మీ (60), కర్మన్‌ఘాట్‌కు చెందిన రాజు కుమారుడు  సురేష్‌ (28), అంబర్‌పేటకు చెందిన ఖాజా కుమారుడు సోహెల్‌ (35) మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకొండకు చెందిన వెంకటయ్య కుమారుడు కష్ణ(40)లు మతి చెందారు. అంబర్‌పేటకు చెందిన మాజిద్, వెంకటేష్‌లు స్వల్ఫంగా గాయపడ్డారు. ఒక్క సారిగా భారీ గోడ కూలడంతో వివాహ వేడుకల్లో కలకలం రేగింది. ఏం జరిగిందో తెలుసుకేలోపే గోడ శిధిలాల క్రింద పడి ఉన్నారు. వెంటనే స్థానికులు, పోలీసులు, పెండ్లీ వేడుకలకు హజరైనవారు అంత కలిసి శిధిలాల క్రింద ఉన్న వారిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

నిలువెత్తు నిర్లక్ష్యం...
పెరెల్‌ గార్డెన్‌ యాజమాని తీవ్ర నిర్లక్ష్యంతో ప్రమాదరం జరిగింది. మరమ్మత్తుల పేరిట ఫంక్షన్‌హాల్‌లో కొత్త భాగం మధ్యలో పెద్ద గోడ నిర్మించాడు. గోడ నిర్మించడానికి కనీసం పిల్లర్, పూనాది కూడ తీయకుండా చెక్కలు పెట్టినట్లు నిర్మించాడు. అంతేకాకుండా 9 అంగుళాల గోడపై 14 అంగుళాల పిల్లర్‌ను కూడ ఏర్పాటు చేయడంతో బరువు తట్టుకోలేక పోయింది. నిర్మించిన గోడ ఎక్కడ ప్రమాణాలు లేకపోవడంతో ఒక్క ఉదటున కుప్ప కూలి పోయింది. మరమ్మత్తులకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోనట్లు తెలుస్తుంది.

మరమ్మతులు ఉన్నా పూర్తి చేసి ఇస్తామన్నాడు:సదానందం, పెండ్లీ కుమార్తె తండ్రి
గత 45 రోజుల క్రితమే పెరెల్‌ గార్డెన్‌కు రాగా మరమ్మతులు జరుగుతున్నాయి. మీ పెండ్లి నాటికి మరమ్మతులు పూర్తి చేసి అందిస్తానని చెప్పడంతో బుక్‌ చేసుకున్నారు. డబ్బులు కూడా చెల్లించాం. ఇలాంటి మరమ్మతులు ఉంటే ఇవ్వకుండా ఉండాల్సింది. ఇలాంటి సంఘటన తమను తీవ్రంగా కలిచివేచింది. సంఘటన పట్ల ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి.


భోజనలతో తగ్గిన నష్టం..
అప్పుడే అంతా భోజనాలకు బయలు దేరారు. ఆ సమయంలో గోడ కూలింది. లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగేది. ఫంక్షన్‌ హాల్‌కు మధ్యలో ప్రమాదానికి కారణమైన గోడ ఉండడ ఇంతటి ప్రాణ నష్టం కారణమైంది. 

క్రిమినల్‌ కేసులు నమోదు: ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేష్‌
సంఘటన తెలుసుకున్న ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేష్, ఏసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమారులు హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో బందోబసు ఏర్పాటు చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు.

రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌...
సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిధిలాల క్రింద ధ్వంసమైన వాహనాలను బయటకి తీశౠరు. పడిపోయిన గోడ శిధిలాలను జేసీబీ వాహనంతో పక్కకు తొలగించారు.

చదవండికాసేపట్లో పెళ్లి.. ఫంక్షన్‌హాల్‌లో తీవ్ర విషాదం!

సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement