నగరంలోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు పక్కన దారుణం చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు పక్కన దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని దుండగులు సజీవ దహనం చేశారు. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగు చూసింది. దుండుగులు బాధితురాలిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో మహిళ అక్కడికక్కడే చనిపోయినట్లు తెలస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.