
అమ్మాయిల గదిలోకి వెళ్లి హంగామా...
హైదరాబాద్: తప్పతాగి ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాత్రి వేళ అమ్మాయిల గదిలోకి వెళ్లి హంగామా సృష్టించాడు. సోమవారం అంబర్‌పేట ఎస్‌ఐ మహిపాల్ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక శంకర్‌నగర్‌కు చెందిన ధృవకుమార్ ఇంట్లో నలుగురు అమ్మాయిలు గది అద్దెకు తీసుకొని ఉంటూ చదువుకుంటున్నారు. ధృవకుమార్ కుమారుడు నిషాంత్(25) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.
ఆదివారం రాత్రి 11.30 ప్రాంతంలో తప్పతాగి ఉన్న నిషాంత్ అమ్మాయిల గదిలోకి చొరబడి అనుచితంగా ప్రవర్తించాడు. అమ్మాయిలు పెద్దగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలించారు. వారు నిషాంత్‌ను మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిషాంత్‌పై నిర్భయ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
విద్యార్థినిపై అఘాయిత్యం..
జీడిమెట్ల: విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్ డివిజన్ విజయనగర్ కాలనీకి చెందిన బాలిక(14) చింతల్‌లోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈనెల 12న తల్లిదండ్రులు బయటకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై స్థానికుడు రమేష్ (19) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేష్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.