అంబర్‌పేట్ (హైదరాబాద్) : స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన గాంధీ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని అంబర్‌పేట అంబెద్కర్ నగర్‌కు చెందిన పి.నటరాజు(28) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో పదిరోజుల కిందట అనారోగ్యానికి గురై ఫీవర్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో.. గాంధీకి రిఫర్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు సోమవారం మృతిచెందాడు.