
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన ‘జన ఆశీర్వాదయాత్ర’లో భాగంగా ఆయన శనివారం హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చేరుకున్నారు. ఆయన అంబర్‌పేట్ నియోజకవర్గ ప్రజలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. కిషన్‌రెడ్డి మాట్లాతుడూ.. అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉందన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్‌పేట ప్రజలు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలని గుర్తుచేశారు.
చదవండి: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?
అంబర్‌పేట ప్రజలు తన ప్రాణమని భావోద్వేగంతో ప్రసంగిస్తూ కంటతడిపెట్టకున్నారు. కేంద్ర మంత్రి అయినందుకు తనకు సంతోషం లేదని, అంబర్‌పేటకు దూరమయ్యానని బాధగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంబర్ పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పని చేస్తానని తెలిపారు. దేశానికి మంత్రినైనా అంబర్‌పేటకు ముద్దు బిడ్డనేనని కిషన్‌రెడ్డి అన్నారు.