అంబర్‌పేట (హైదరాబాద్) : బస్సు ఎక్కుతుండగా ఓ వృద్ధురాలు చైన్ స్నాచింగ్‌కు గురైంది. ఈ సంఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..వరంగల్ జిల్లా పాలకర్తి మండలానికి చెందిని యాదమ్మ(60) అంబర్‌పేటలో ఉన్న తన కూతురి ఇంటికి వచ్చింది.
కాగా ఆమె సోమవారం తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు అంబర్‌పేట ప్రధాన రోడ్డు మహంకాళి ఆలయం వద్ద వరంగల్ బస్సు ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాక ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని గమనించుకోగా కనపడలేదు. దీంతో ఆందోళన చెంది బస్సు దిగి అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు ఎక్కుతుండగా.. గొలుసు చోరీ
Published Mon, Sep 14 2015 8:08 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement
Advertisement