
బాధితురాలు రాజమ్మ, పట్టుబడ్డ నిందితురాలు
సాక్షి, బెంగళూరు: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డ మహిళను పట్టుకుని చితకబాదిన స్థానికులు ఆమెను పోలీసులకు అప్పగించిన సంఘటన దొడ్డ తాలూకా మధురె గ్రామంలో చోటుచేసుకుంది. హెసరఘట్ట గ్రామానికి చెందిన రాజమ్మ అనే వృద్ధురాలు పని నిమిత్తం మధురె గ్రామానికి వచ్చింది. పని ముగించుకుని బస్సు కోసం మధురె గ్రామం బస్టాప్‌లో వేచి ఉండగా బైక్‌పై వచ్చిన ఒక మహిళ, మరో వ్యక్తి తాము దంపతులమని చెప్పుకుని రాజమ్మతో మాటలు కలిపారు.
హఠాత్తుగా మహిళ రాజమ్మ మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పరారవడానికి ప్రయత్నించింది. అయితే స్థానికులు రావడం గమనించి బైక్‌పై పరారవడానికి చేసిన ప్రయత్నంలో మహిళ కిందపడిపోగా వ్యక్తి బైక్‌పై పరారయ్యాడు. పట్టుబడ్డ మహిళను చితకబాదిన స్థానికులు అనంతరం ఆమెను దొడ్డబెళవంగల పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ మహిళ పేరు నందినిగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment