హైదరాబాద్ : అబిడ్స్ బొగ్గులకుంటలో బుధవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రహదారిపై నడిచి వెళ్తున్న మహిళపై స్నాచర్లు దాడి చేశారు. అనంతరం ఆమె మెడలోని గొలుసు తెంచుకుని... బైక్పై అక్కడి నుంచి పరారైయ్యారు. చైన్ స్నాచర్ల దాడిలో గాయపడిన మహిళను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.