బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని వచ్చిన ఇద్దరు మోసగాళ్లు మాయమాటలు చెప్పి ముగ్గురు మహిళల నుంచి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన నగరంలోని అంబర్‌పేట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.
హైదరాబాద్ : బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని వచ్చిన ఇద్దరు మోసగాళ్లు మాయమాటలు చెప్పి ముగ్గురు మహిళల నుంచి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన నగరంలోని అంబర్‌పేట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. అంబర్‌పేట్‌లోని బస్తీలో శుక్రవారం బంగారు ఆభరణాలకు మెరుగులు పెడతామని వచ్చిన ఇద్దరు వ్యక్తులు ముగ్గురు మహిళల నుంచి 12 తులాల బంగారు ఆభరణాలను తీసుకొని మెరుగుపెడతామని మాయమాటలు చెప్పి వారిని నమ్మించి అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫూటేజిల సాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు.