ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్.వెంకట్రామ్‌రెడ్డి (భాయ్ సాబ్) అంత్యక్రియలు అంబర్‌పేట్‌లోని శ్మశాన వాటికలో శనివారం రెండు గంటల ప్రాంతంలో జరిగాయి. అంతకుముందు భాయ్ సాబ్ భౌతిక కాయాన్ని కడసారిగా చూసేందుకు పలువురు రాజకీయ, క్రీడాప్రముఖులు, క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటలకు వరకు క్రీడాకారులు, క్రీడాభిమానుల సందర్శనార్ధం భాయ్ సాబ్ భౌతిక కాయాన్ని ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్‌లో ఉంచారు.
భాయ్ సాబ్ భౌతిక కాయాన్ని మాజీ డీపీజీ హెచ్.జె.దొర, బ్యాడ్మిం టన్ ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు ఆరిఫ్, పి.గోపీచంద్, వాలీబాల్ అర్జున అవార్డు గ్రహీతలు రమణ, రవికాంత్‌రెడ్డి, ముళిని రెడ్డి, టేబుల్ టెన్నిస్ అర్జున అవార్డు గ్రహీత మీర్ ఖాసిమ్ అలీ, మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, ఏపీవీఏ మాజీ కోశాధికారి రామచంద్రరెడ్డి, జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్, ‘శాప్’ తరఫున డిప్యూటీ డెరైక్టర్లు శోభ, రమేష్ తదితరులు సందర్శించి పుష్ప గుచ్ఛాలు సమర్పించారు.
అనంతరం విఠల్‌వాడిలోని భాయ్ సాబ్ స్వగృహం వద్దకు ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ రాష్ట్ర మహిళల శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీత లక్ష్మారెడ్డి సందర్శించి పుష్పమాలతో నివాళి అర్పించారు. అనంతరం జరిగిన భాయ్ సాబ్ అంతిమ యాత్రలో కాచిగూడ మీదుగా అంబర్‌పేట్‌లోని శ్మశాన వాటిక వరకు జరిగింది.
అక్కడి జరిగిన భాయ్ సాబ్ చితికి పెద్ద కొడుకు మంజిత్ రెడ్డి నిప్పంటించారు. ఈ అంతిమ యాత్రలో భారత వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ వెంకట్ నారాయణ, రాష్ట్ర నెట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.సోమేశ్వర్‌రావు, ఏజీ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి బాలరాజ్, జూడో సంఘం కార్యదర్శి కైలాష్ యాదవ్, ఓయూ ఫిజికల్ ఎడ్యకేషన్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్‌రావు, రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శి నర్సింగమ్‌రెడ్డి, పి.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భాయ్ సాబ్‌కు కన్నీటి వీడ్కోలు
Published Sat, Jan 4 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement