
శివంరోడ్డులో కుంగిన రోడ్డు: ట్రాఫిక్ జాం
నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అంబర్పేటలోని శివంరోడ్డులో రహదారి కుంగింది.
హైదరాబాద్ : నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అంబర్పేటలోని శివంరోడ్డులో రహదారి కుంగింది. దీంతో అదే రహదారిపై వెళ్తున్న లారీ దిగబడింది. దాంతో సదరు రహదారిలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ట్రాఫిక్ను మరో మార్గంలో మళ్లించేందుకు చర్యలు చేపట్టారు.