విజేత జీహెచ్‌ఎంసీ నార్త్‌జోన్ | north zone won by four wickets against with head office team | Sakshi
Sakshi News home page

విజేత జీహెచ్‌ఎంసీ నార్త్‌జోన్

Published Sat, Dec 14 2013 12:32 AM | Last Updated on Fri, May 25 2018 7:33 PM

north zone won by four wickets against with head office team

జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ మీట్
 జింఖానా, న్యూస్‌లైన్: జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో నార్త్ జోన్ జట్టు 4 వికెట్ల తేడాతో హెడ్‌ఆఫీస్‌పై నెగ్గింది. అంబర్‌పేట మైదానంలో శుక్రవారం మొదట బ్యాటింగ్ చేసిన హెడ్ ఆఫీస్ 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
 
 రాజారామ్ 23, న ర్సింగ్ రావు 22 పరుగులు చేశారు. ఆదిల్ 3, కార్తీక్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన నార్త్ జోన్ 14.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. కార్తీక్ (35), కిరణ్ కుమార్ (26), గోవర్ధన్ రెడ్డి (18 నాటౌట్) మెరుగ్గా ఆడారు. జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్ బౌలర్లు దయానంద్, రఘు చెరో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement