పోలీసు అధికారి సూట్కేసులో బుల్లెట్లు | Karnataka police officer held at chennai airport with Bullets in suitcase | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారి సూట్కేసులో బుల్లెట్లు

Published Sat, Sep 6 2014 8:34 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

పోలీసు అధికారి సూట్కేసులో బుల్లెట్లు - Sakshi

పోలీసు అధికారి సూట్కేసులో బుల్లెట్లు

చెన్నై : కర్ణాటక రాష్ట్ర పోలీసు అధికారి సూట్కేసులో తుపాకీ బుల్లెట్లు లభించటంతో చెన్నై విమానాశ్రయంలో కలకలం రేగింది. చెన్నై నుంచి అండమాన్కు వెళ్లే జెట్ ఎయిర్వేస్ విమానం శుక్రవారం ఉదయం డొమెస్టిక్ టెర్మినల్ నుంచి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది.అందులో ప్రయాణికుల వద్ద భద్రతా అధికారులు తనిఖీలు జరిపారు. ఆ సమయంలో కర్ణాటకకు చెందిన క్రిమత్ అనే వ్యక్తి ఆ విమానంలో ప్రయాణించేందుకు వచ్చారు. ఆయన రాష్ట్ర సాయుధ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. లగేజీ తనిఖీ చేస్తుండగా సూట్కేసులో బాంబులు ఉన్నట్లు అలారం మోగింది.

దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్ నిపుణలను రప్పించారు. సూట్కేసును నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లి తనిఖీ చేయగా బాంబులేవీ లేవని గుర్తించారు. అయితే అందులో మూడు తుపాకీ బుల్లెట్లు కనిపించాయి. పోలీసులు క్రిమత్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  కర్ణాటక డీజీపీకి ఈ సమాచారాన్ని అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement