ఏపీ సచివాలయంలో సూట్‌కేస్ కలకలం | Suspicious suitcase found in AP Secretariat | Sakshi
Sakshi News home page

ఏపీ సచివాలయంలో సూట్‌కేస్ కలకలం

Published Fri, Feb 19 2016 3:03 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఏపీ సచివాలయంలో సూట్‌కేస్ కలకలం - Sakshi

ఏపీ సచివాలయంలో సూట్‌కేస్ కలకలం

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో శుక్రవారం ఓ సూట్‌కేస్ కలకలం రేపింది. సీఎం ఉండే ఫ్లోర్  కావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. సచివాలయానికి వచ్చిన ఒక మహిళ తన సూట్‌కేస్‌ను గది బయట ఉంచి లోపలికి వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న కొంతమంది కంగారు పడి పోలీసులకు సమాచారం అందించారు. వారు సూట్‌కేస్‌ను తెరచి చూడగా అందులో దుస్తులు మాత్రమే ఉండటం చూసి ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement