
కవ్వింత: సర్దుకోవాలి...
‘‘భార్యాభర్తల మధ్య గొడవైతే సర్దుకుపోవాలని చెప్పడం పొరపాటయ్యిందిరా.’’ ‘‘ఏమయ్యింది?’’ ‘‘సూట్‌కేసు సర్దుకుని పుట్టింటికెళ్లిపోయిందిరా మా ఆవిడ.’’
ఎలా?
సూర్యం: ఎందుకురా అలా దిగులుగా ఉన్నావ్?
చంద్రం: ఏం లేదురా. చిన్నమ్మాయికి ఒకెకరం, రెండో అమ్మాయికి ఎకరం, అబ్బాయికి రెండెకరాలు రాసిచ్చానురా.
సూర్యం: అలా చేసినందుకు సంతోషించాలి గాని ఎందుకురా బాధపడతావ్?
చంద్రం: ఆ నాలుగెకరాలు ఎలా సంపాదించాలా అని!
కరెంటు షాక్
‘‘ఆ సుబ్బారావుగాడికి రెండుసార్లు కరెంటు షాక్ కొట్టి చనిపోయాడు’’ అన్నాడు మూర్తి.
‘‘ఓ అలాగా! మొదటిసారి షాక్ కొట్టినప్పుడు చనిపోయాడా? రెండోసారి కొట్టినప్పుడు చనిపోయాడా?’’ దీర్ఘం తీశాడు సూర్యం.
రోజుకో పువ్వు
భార్య: మీ పిసినారితనం మండిపోనూ! మల్లెపూలు తెమ్మంటే రెండు రూపాయలవి తెస్తారా?
భర్త: ఫ్రిజ్‌లో పెట్టి రోజుకో పువ్వు పెట్టుకో!
ఎలా వెళ్ళాలి?
పరంధామం: బాబూ! ఇక్కడ బార్బర్ షాపుకి ఎలా వెళ్లాలి?
వెంగళప్ప: తల నిండా జుట్టుతో వెళ్లాలండీ!
పంపినవారు: సీహెచ్‌వీవీఎస్ మూర్తి, పాల్వంచ