ప్రయాణాల్లో లగేజీ తప్పనిసరి. ఎంత లగేజీకి అంత మోత తప్పదు. ఫొటోలో కనిపిస్తున్న విచిత్రాకార సూట్‌కేసు గనుక మీ వెంట ఉంటే, మోత భారం తప్పుతుంది. ఎందుకంటే, దీనిని మోసే అవసరమే ఉండదు. మీరు ఎక్కడకు వెళ్లినా, ‘నిను వీడని నీడను నేనే...’ అన్నట్లుగా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తుంది. ఇది స్వయంచాలక రోబో సూట్‌కేసు.
వెస్పా స్కూటర్లను తయారు చేసే ఇటాలియన్ బహుళజాతి కంపెనీ ‘పియాగియో’కు అనుబంధ సంస్థ అయిన ‘పియాగియో ఫాస్ట్ ఫార్వర్డ్’కు చెందిన డిజైనర్లు ఈ రోబో సూట్‌కేసుకు రూపకల్పన చేశారు. ఫొటోలో కనిపిస్తున్నది ‘గిటా మినీ’ రోబో సూట్‌కేసు. ఇలాంటివి కాస్త పెద్ద పరిమాణంలోనూ ‘పియాగియో ఫాస్ట్ ఫార్వర్డ్’ సంస్థ రూపొందించింది.
చదవండి: Eco Friendly Maker: ఆ సమస్యలకు చెక్.. లారీ షేప్‌లో ఉన్న ఈ ఎకో–ఫ్రెండ్లీ గ్రిల్ ధర రూ.17,859!
Comments
Please login to add a commentAdd a comment